Acham Naidu Comments: ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా పడ్డాయి. దీనిపై ప్రతిపక్షాలన్నీ ఫైర్ అవుతున్నాయి. అర్ధాంతరంగా ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ తీరుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీఎం జగన్‌ కోర్టు వాయిదాలకు అలవాటు పడ్డారని..అదే తరహాలోనే పదో తరగతి ఫలితాలను వాయిదా వేశారా అని ప్రశ్నించారు. పరీక్షా ఫలితాలను చివరి నిమిషంలో ఎందుకు వాయిదా వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసమర్థ పాలన వల్ల విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటారా అని ఫైర్ అయ్యారు. మద్యం వ్యాపారం చేసుకునే వ్యక్తికి విద్యా శాఖ మంత్రిని చేశారని విమర్శించారు. సీఎం జగన్..అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ నాశనం అవుతుందన్నారు. వైసీపీ పాలనలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సీఎం జగన్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు అచ్చెన్నాయుడు.


ఏపీలో ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల కావాల్సిన ఫలితాలు వాయిదా పడ్డాయి. కొన్ని కారణాల వల్ల ఫలితాలను సోమవారానికి వాయిదా వేశామని విద్యా శాఖ వెల్లడించింది. సాంకేతిక కారణాలతోనే వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఫలితాలను విడుదల చేసేందుకు విద్యా శాఖ అధికారులు చివరి నిమిషం వరకు ప్రయత్నించారని..కానీ అన్ని విఫలమయ్యాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


Also read: Rahul Gandhi Twit: లోక్‌ కళ్యాణ్ మార్గ్‌తో ప్రజలకు సంక్షేమం దక్కదు..మోదీపై రాహుల్ సెటైర్లు..!


Also read:Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ టెర్రర్..భారత్‌లోనూ తాజాగా కేసు నమోదు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook