Siraj Welcome: సిరాజ్‌ మియాకు హైదరాబాద్‌ గ్రాండ్‌ వెల్కమ్‌.. కానీ ప్రభుత్వమే?

Hyderabad Grand Welcomes To Mohammed Siraj: టీ20 ప్రపంచ కప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ మహ్మద్‌ సిరాజ్‌ తన పురిటి గడ్డ హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఢిల్లీ, ముంబైలో విజయోత్సవాల అనంతరం చేరుకోగా హైదరాబాద్‌ ప్రజలు ఊహించని రీతిలో స్వాగతం పలికారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం సిరాజ్‌ను విస్మరించింది.

1 /8

Mohammed Siraj: టీ20 ప్రపంచ కప్‌ సాధించిన తర్వాత తొలిసారి మహ్మద్‌ సిరాజ్‌ తన పురిటి గడ్డ హైదరాబాద్‌కు చేరుకున్నాడు.

2 /8

Mohammed Siraj: భారత జట్టులో అద్భుతమైన బౌలర్‌గా సిరాజ్‌ కొనసాగుతున్నాడు.  

3 /8

Mohammed Siraj: ప్రపంచకప్‌లో తన శక్తి మేర ప్రయత్నం చేసి జట్టు విజయాల్లో కీలక భూమిక పోషించాడు.

4 /8

Mohammed Siraj: ఢిల్లీ, ముంబైలో విజయోత్సవాల అనంతరం శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చాడు.  

5 /8

Mohammed Siraj: ప్రపంచకప్‌ తీసుకువచ్చిన జట్టులో ఉన్న సిరాజ్‌కు హైదరాబాద్‌ ప్రజలు ఘన స్వాగతం పలికారు.  

6 /8

Mohammed Siraj: శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సిరాజ్‌ నివాసం వరకు పెద్ద ఎత్తున ప్రజలు, క్రికెట్‌ అభిమానులు స్వాగతించారు.  

7 /8

Mohammed Siraj: ఓపెన్‌ కారుపై నిల్చుని సిరాజ్‌ అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లాడు.  

8 /8

Mohammed Siraj: సిరాజ్‌ స్వస్థలం చేరుకోగా.. తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఒక్క మంత్రి కూడా సిరాజ్‌కు స్వాగతం పలకకపోవడం గమనార్హం.