Chandrababu Hyd: హైదరాబాద్‌ నడిబొడ్డున సీఎం చంద్రబాబు విజయ గర్జన

Chandrababu Naidu Rally In Hyderabad: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చారు. బేగంపేటలో దిగిన ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల సమస్యలపై రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

1 /8

Chandrababu Naidu: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చారు.

2 /8

Chandrababu Naidu: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటలో దిగారు. తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

3 /8

Chandrababu Naidu: ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఒక విధంగా హైదరాబాద్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

4 /8

Chandrababu Naidu: ఓటుకు నోటు కేసుతో తట్టాబుట్టా సర్దుకుని నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏపీకి పారిపోయారు. మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో విజయగర్వంతో తెలంగాణపై అడుగుపెట్టారు.

5 /8

Chandrababu Naidu: హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీకి చెందిన కమ్మ, కాపులు ఈ విజయోత్సవ ర్యాలీలో భారీగా పాల్గొన్నారు.

6 /8

Chandrababu Naidu: తెలుగు రాష్ట్రాల సమస్యలపై రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చంద్రబాబు సమావేశం కానున్నారు.  

7 /8

Chandrababu Naidu: గురుశిష్యులుగా ఉన్న వీరిద్దరూ సమావేశం కానుండడం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

8 /8

Chandrababu Naidu: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంతో ఇరు ప్రాంతాల సమస్యలు పరిష్కారమవుతాయని అందరూ భావిస్తున్నారు.