Atchannaidu Arrest: AP TDP President Atchannaidu Arrested: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వివాదాల వేడిని పెంచుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థిని బెదిరించాడన్న ఆరోపణలతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం అచ్చెన్నాయుడును కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏపీలో నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికల(AP Local Body Elections 2021) నామినేషన్ల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అచ్చెన్నాయుడు‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తిని అచ్చెన్నాయుడు బెదిరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు రావడంతో స్పందించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు(Atchnnaidu Arrested) అరెస్టుతో అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య పంచాయతీ ఎన్నికల పోరు తారా స్థాయికి చేరేలా కనిపిస్తోంది.


Also Read: Privilege committee enquiry: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమర్‌పై చర్యలు ప్రారంభించిన స్పీకర్



మరోవైపు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(YSRCP MP Vijayasai Reddy) పర్యటనలో ఏ సమస్య తలెత్తకూడదని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కోటబొమ్మాళి, నిమ్మాడలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై అధికార వైఎస్సార్‌సీపీ(YSRCP) కక్ష సాధిస్తుందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే ఆయనను అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read: Nimmagadda Ramesh Kumar: Voter ID కోసం ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తంటాలు!



అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(TDP Chief Chandrababu Naidu) ఖండించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు అచ్చెన్నాయుడు అరెస్ట్ పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం జగన్ కక్షకట్టి భయోత్పాతం సృష్టిస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. 


Also Read: Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 2, 2021 Rasi Phalalu


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook