Privilege committee enquiry: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమర్‌పై చర్యలు ప్రారంభించిన స్పీకర్

Privilege committee enquiry: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీ సభా హక్కుల ఉల్లంఘన కేసు ఎదుర్కొంటున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ చర్యలు ప్రారంభించారు. 

Last Updated : Feb 1, 2021, 10:00 PM IST
Privilege committee enquiry: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమర్‌పై చర్యలు ప్రారంభించిన స్పీకర్

Privilege committee enquiry: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీ సభా హక్కుల ఉల్లంఘన కేసు ఎదుర్కొంటున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ చర్యలు ప్రారంభించారు 

స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయితీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణకు దిగిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec Nimmagadda Ramesh Kumar ) మరో వివాదంలో చిక్కుకున్నారిప్పుడు. ఎన్నికల నిర్వహణ కంటే ఇతర విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపించిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సభా హక్కుల ఉల్లంఘన కేసు ( Privilege Notices ) లో ఇరుక్కున్నారు. ప్రభుత్వ పెద్దలు, మంత్రులపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో సీనియర్ శాసనసభ్యులుగా, మంత్రులుగా తమ హక్కులకు భంగం కల్గించారని..తమ గౌరవాన్ని మంట గొలిపేలా వ్యవహరించారంటూ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra reddy ), బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana )లు ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు నోటీసులు అందించారు.  

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Nimmagadda Ramesh kumar )..రాష్ట్ర గవర్నర్ ( Ap Governor ) ‌కు రాసిన లేఖలో తమపై మోపిన నిందారోపణలు బాధను, మానసిక వేదనను కల్గించాయని మంత్రులు ఫిర్యాదు చేశారు. ఆ కలతతోనే లేఖ గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నామని..లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్న అంశాలు సోషల్ మీడియాతో పాటు ఇతర చోట్ల విస్త్రృతంగా ప్రచారం అవుతున్నాయని మంత్రులు తెలిపారు. ఈ ఫిర్యాదును స్పీకర్ తమ్మినేని సీతారాామ్( Ap Speaker Tammineni Sitaram ) సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఫిర్యాదును పూర్తిగా పరిశీలించిన స్పీకర్ తమ్మినేని సీతారామ్..మంత్రుల ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రివిలైజ్ కమిటీ ( Privilege Committee )కు ఆదేశించారు. ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టనుంది. 

Also read: Ap government on Union Budget 2021: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ అధికార పార్టీ అసంతృప్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News