Acham Naidu Comments: టీడీపీలో కొత్త జోష్‌ కనిపిస్తోంది. ఒంగోలు వేదికగా జరిగిన మహానాడు సక్సెస్‌ అయ్యింది. సభ వేదికగా పలు కీలక నిర్ణయాలు, తీర్మానాలు చేశారు. పార్టీ శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని నిర్ణయించారు. రానున్న రోజుల్లో మరిన్ని మహానాడులు నిర్వహించాలని తీర్మానం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 2019లో తెలిసో..తెలియకో ప్రజలు వారికి అధికారం ఇచ్చారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి 160 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. వైసీపీ ..అడ్రస్‌ లేకుండా పోతుందన్నారు. మహానాడు ప్రభంజనం చూస్తుంటే..ఇదే కనిపిస్తోందని చెప్పారు.


2019లో చంద్రబాబు లాంటి వ్యక్తికి ఓటు వేయకుండా రూ.లక్షల కోట్లు దోపిడీ చేసిన వ్యక్తికి ఓటు వేశారన్నారు. ఈ మూడేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. మళ్లీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు రావాలని పిలుపునిచ్చారు. అమలాపురంలో అల్లర్లకు వైసీపీ నేతలే కారణమని ఫైర్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని తప్పక గెలిపించాలన్నారు. మహానాడు సక్సెస్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


Also read:Trolls on Siraj: ఆర్సీబీ ఓటమి తర్వాత సిరాజ్‌పై విపరీతమైన ట్రోల్స్... ఫ్యామిలీని చంపేస్తామని బెదిరింపులు...   


Also read:TDP Mahanadu: క్విట్ జగన్-సేవ్ ఆంధ్రప్రదేశ్‌..మహానాడు వేదికగా చంద్రబాబు పిలుపు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook