Trolls and Threats to Mohammed Siraj: ఐపీఎల్‌లో భాగంగా జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోవడాన్ని ఆర్సీబీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్సీబీ ఓటమికి బౌలర్ మహమ్మద్ సిరాజే కారణమని నిందిస్తూ సోషల్ మీడియా వేదికగా కొంతమంది నెటిజన్లు అతనిపై దాడికి దిగుతున్నారు. మధ్యలో సిరాజ్ కుటుంబాన్ని కూడా లాగి.. వారిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ మ్యాచ్ తర్వాత సిరాజ్ కూడా ఇక తన తండ్రి లాగే ఆటో నడుపుకోవాలంటూ హేళన చేస్తున్నారు. నిజానికి ఈ మ్యాచ్‌లో బెంగళూరు అటు బ్యాటింగ్ పరంగా, ఇటు బౌలింగ్ పరంగా రెండింటా విఫలమైందనే చెప్పాలి. అయినప్పటికీ సిరాజ్ ఒక్కడినే ఓటమికి బాధ్యుడిని చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సిరాజ్‌పై విమర్శలను, బెదిరింపులను ఖండిస్తూ పలువురు నెటిజన్లు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. సిరాజ్‌ను విమర్శించేందుకు అతని తండ్రి వృత్తిని ప్రస్తావిస్తూ అవమానపర్చడం సరికాదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. సిరాజ్‌ను విమర్శించడంలో తప్పు లేదు కానీ... అది కాస్త అర్థవంతంగా, నిర్మాణాత్మకంగా ఉంటే బాగుంటుందని మరికొందరు కామెంట్స్ చేశారు.
ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకున్న ముగ్గురు ప్లేయర్స్‌లో మహమ్మద్ సిరాజ్ ఒకడు. అయితే ఈ సీజన్‌లో సిరాజ్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. 15 మ్యాచ్‌లు ఆడిన అతను... దాదాపుగా అన్ని మ్యాచ్‌ల్లో ఓవర్‌కు 10 చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాదు, ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధికంగా 31 సిక్సులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు, 30 సిక్సులతో ఈ చెత్త రికార్డు డ్వేన్ బ్రావో పేరిట ఉంది.
నిన్న (మే 27) రాజస్తాన్‌తో మ్యాచ్‌లోనూ సిరాజ్ నిరాశపరిచాడు. రెండు ఓవర్లలోనే 31 పరుగులు సమర్పించుకున్నాడు. సిరాజ్ వేసిన 1, 3వ ఓవర్లలో రాజస్తాన్ బౌలర్లు బౌండరీల మీద బౌండరీలు బాదారు. దీంతో సిరాజ్‌కు ఓపెనింగ్ స్పెల్ ఇవ్వకుండా ఇవ్వాల్సిందని ఆర్సీబీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇదే మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్ షాబాద్ అహ్మద్ 2 ఓవర్లలోనే 35 పరుగులు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ నెటిజన్లు మహమ్మద్ సిరాజ్‌నే టార్గెట్ చేయడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఓటమితో బెంగళూరు ఇంటి దారి పట్టగా... గుజరాత్-రాజస్తాన్ జట్ల మధ్య ఆదివారం (మే 29) ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Mohammed Siraj after this match According to RCB Fans 😂🤣#RCBvsRR pic.twitter.com/fGLace02Hd
— Ritika Malhotra🇮🇳 (@FanGirlRohit45) May 27, 2022
Then Daniel Christian and now Mohammad Siraj..
RCB fans doing what they are known for💔 pic.twitter.com/XcB3XeDA1T— Vansh (@Vansh8100) May 27, 2022
A guy under Mohammad siraj's post just said, it's good that your father died??? man, get a life. If you wanna criticise, criticise him constructively. STOP BRINGING HIS FATHER AND RELIGION WHILE BLAMING HIM, cause it shows how you were raised.
— siddhi (@_sectumsempra18) May 28, 2022
Also Read: TDP Mahanadu: క్విట్ జగన్-సేవ్ ఆంధ్రప్రదేశ్..మహానాడు వేదికగా చంద్రబాబు పిలుపు..!
Also Read: Viral News: అరుదైన కేసు... భార్యతో 10ని. శృంగారం తర్వాత 'గజిని'లా మారిన వ్యక్తి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook