AP Tenth class exams 2021 and AP inter exams 2021 schedules: అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షలు, ఇంటర్ పరీక్షలు ఎప్పుడు ? అసలు పరీక్షలు నిర్వహిస్తారా లేదా వేరే రాష్ట్రాల బాటలోనే పరీక్షలు లేకుండా పాస్ చేస్తారా ? ప్రస్తుతం ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. వారి సందేహాలకు సమాధానం చెబుతూ ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పలు వివరాలు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతానికి కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గి కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జులైలో పరీక్షలు నిర్వహించే వాతావరణం ఉంటుందని ఏపీ విద్యా శాఖ భావిస్తోందని, మరో రెండు వారాల్లో పరిస్థితులు చక్కబడితే, జూలై మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక పదో తరగతి పరీక్షలు (AP 10th class exams 2021) విషయానికొస్తే.. జులై ఆఖర్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. తుది నిర్ణయం ఏదైనా అప్పటి పరిస్థితులను అనుసరించి సీఎం జగన్‌తో (AP CM YS Jagan) చర్చించిన తర్వాతే తీసుకుంటామని మంత్రి తెలిపారు. 


Also read : AP Corona Update: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా ఉధృతి, ఆందోళన రేపుతున్న థర్డ్‌వేవ్ హెచ్చరికలు


ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్టు చెప్పిన మంత్రి సురేష్... పరీక్షల నిర్వహణకు కనీసం 15 రోజుల ముందు పరీక్షల షెడ్యూల్ (AP Inter exams 2021 schedule) ప్రకటించాల్సి ఉంటుందని అన్నారు. ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన అనంతరం ఆగస్టులో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మసీ, ఇతర ప్రవేశ పరీక్షలు నిర్వహించి సెప్టెంబర్‌లో తరగతులు ప్రారంభించాలని ఏపీ సర్కార్ (AP govt) ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ (AP minister Adimulapu Suresh) పేర్కొన్నారు.


Also read: Papikondalu Tourism: పాపికొండలు పర్యాటకానికి గ్రీన్ సిగ్నల్, త్వరలో ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook