AP Corona Update: కరోనా మహమ్మారి ఏపీలో తగ్గుముఖం పడుతోంది. గత కొద్దికాలంగా కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతోంది. ఓ వైపు కరోనా మహమ్మారిని నియంత్రిస్తూనే మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతి రోజురోజుకూ తగ్గుతోంది. అటు కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు అదే సమయంలో కరోనా థర్డ్‌వేవ్ ( Corona Third Wave)హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) సూచన మేరకు జనావాసాలకు చేరువలో ప్రత్యేక హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారులకు వైద్యం విషయంలో వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.థర్డ్‌వేవ్‌కు అవసరమైన మందుల్ని అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి ఆళ్ల నాని (Alla Nani) అధికారులకు సూచించారు. అదనంగా వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించుకోనున్నారు.
గత 24 గంటల్లో ఏపీలో 96 వేల 153 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests) చేయగా..5 వేల 741 కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18 లక్షల 20 వేల 134కు చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 53 మంది కరోనా కారణంగా మరణించారు. ఏపీలో గత 24 గంటల్లో 10 వేల 567 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 17 లక్షల 32 వేల 984 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 75 వేల కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2 కోట్ల 6 లక్షల 34 వేల 891 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
Also read: Covaxin Price: వ్యాక్సిన్ ధరలపై స్పష్టత ఇచ్చిన భారత్ బయోటెక్, ప్రైవేటురంగంలో వ్యాక్సిన్ ధర అంతే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook