Ap Three capitals: ఆ నిర్ణయాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణాలనే వాదన వస్తోంది. మున్సిపల్ ఎన్నికల చరిత్రలోనే భారీ విజయాన్ని దక్కించుకోడానికి ప్రభావితం చేసిన అంశాలపై విశ్లేషణ కొనసాగుతోందిప్పుడు. అందుకే వైఎస్ జగన్ తీసుకున్న ఆ నిర్ణయానికి ప్రజామోదం లభించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr congress party) భారీ విజయాన్ని సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 కార్పొరేషన్లు, 74 మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్ని వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంత పరిధిలోని విజయవాడ, గుంటూరు కార్పొరేషన్‌లతో సహా అన్ని మున్సిపాలిటీలు చేజిక్కించుకుంది. అధికారపార్టీ ఇంతటి భారీ విజయాన్ని సాధించడానికి ప్రభావితం చేసిన అంశాలపై ఇప్పుడు విశ్లేషకుల వాదనలు ప్రారంభమయ్యాయి. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు అందాలనే ఉద్దేశ్యంతో వైఎస్ జగన్ (Ap cm ys jagan) ప్రవేశపెట్టిన మూడు రాజధానుల అంశమే (Ap three capital decision) కారణమని అధికశాతం విశ్లేషకుల అభిప్రాయం. అమరావతిలో రైతుల్నించి ఈ అంశంపై వ్యతిరేకత ఉన్నా..మెజార్టీ ప్రజలకు అదికార వికేంద్రీకరణ వైపే మొగ్గుచూపారనడానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమంటున్నారు. ఎందుకంటే విజయవాడ, గుంటూరు కార్పొరేషన్‌లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. 


అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడైన మోపిదేవి వెంకట రమణ సైతం ఇదే అంటున్నారు. గుంటూరు, విజయవాడ ప్రజలు అభివృద్ధి వికేంద్రీకరణ ( Decentralisation of power )కు స్పష్టమైన తీర్పునిచ్చారని తెలిపారు. రేపల్లెలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏడాది కాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రేపల్లె పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి సీఎం తీసుకున్న నిర్ణయాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాయని అన్నారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రజలు ఇచ్చిన తీర్పు చూస్తే సీఎం వైఎస్‌ జగన్‌పై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుందన్నారు.


Also read: Ysr congress party vote share: గణనీయంగా పెరిగిన అధికారపార్టీ ఓటు శాతం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook