వినూత్న నిర్ణయాలతో ముందుకుపోతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( Ap cm ys jagan ) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్లో త్వరలో బల్క్ డ్రగ్ పార్క్ ( Bulk drug park ) ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్క్ ఏర్పాటుకు కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యతను ఏపీఐఐసీ ( APIIC ) కు అప్పగించింది. తూర్పు గోదావరి జిల్లాలో ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా వచ్చే 8 ఏళ్లలో 46 వేల 4 వందల కోట్ల అమ్మకాలు జరగవచ్చని అంచనా ఉంది. ఈ పార్క్ ఏర్పాటుకు దాదాపు 6 వేల 940 కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలుస్తోంది. ఈ పార్క్ ఏర్పాటే కాకుండా ప్రైవేట్ భాగస్వామిని గుర్తించే బాధ్యత..ఐఐసీటీ ( IICT ), సీఎస్ఐఆర్ ( CSIR ) లతో ఎంవోయూ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 2 వేల ఎకరాల్లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ పార్క్ ఏర్పాటు కోసం ఏపీఐఐసీకు అనుబంధంగా ఏపీబీడీఐసీ ఏర్పాటు కానుంది. Also read: Ap Capitals issue: సుప్రీంలో జగన్ సర్కార్‌కు షాక్