ఏపీలో మళ్లీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు హెచ్చరిక జారీ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆగ్నేయ బంగాళాఖాతం ( Bay of Bengal )లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు ( Heavy Rains ) రానున్న రెండ్రోజులపాటు పడనున్నాయని హెచ్చరించింది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని విపత్తు నిర్వహణ శాఖ కమీషనర్ కన్నబాబు సూచించారు. 


అటు కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో కూడా వర్షాలు పడనున్నాయని కమీషనర్ కన్నబాబు తెలిపారు. ఇప్పటికే నివర్ తుపాను ( Nivar Cyclone ) కారణంగా ఏపీ ( Ap ) భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయింది. Also read: AP: రాష్ట్రంలో పాల రాజకీయం, హెరిటేజ్ వర్సెస్ అమూల్ ప్రాజెక్టు