AP Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే భానుడి ప్రతాపం మొదలైంది. ఎండలు మండిపోతున్న తరుణంలో అకాల వర్షాలతో ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోయింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షాలు.. మరో రెండు రోజులు కూడా భారీగా కురవనున్నాయి. పలు చోట్ల  వడగండ్ల వాన కురవగా.. అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో మరో రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజులు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. 


భారీ వర్షాలు, పిడుగుపాటు నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం ఉన్నపుడు పొలాల్లో, చెట్ల కింద ఉండరాదని చెప్పారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.


పలు ప్రాంతాల్లో పిడుగులు పడి.. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని పిడుగురాళ్ల సమీపంలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో విపత్తుల శాఖ అప్రమత్తమైంది. భారీ వర్షాల వేళ పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపురుల చెట్ల కింద ఉండరాదని సూచిస్తోంది.


మరోవైపు హైద‌రాబాద్ న‌గ‌రంలో గురువారం మ‌ధ్యాహ్నం నుంచి రాత్రి వ‌ర‌కు భారీ వ‌ర్షాలు కురిశాయి. హైద‌రాబాద్‌లో మార్చి నెల‌లో ఇంత భారీ స్థాయిలో వ‌ర్షం కురవ‌డం ఎనిమిదేళ్ల తరువాత ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. గురువారం హైద‌రాబాద్‌లో 31.7 మి.మీ.వ‌ర్ష‌పాతం న‌మోదైంది. రెండు రోజుల పాటు కూడా హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వ‌ర్షాల‌తో పాటు వ‌డ‌గండ్ల వాన కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. నగర ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాలని.. అవ‌స‌రం ఉంటేనే బ‌య‌ట‌కు రావాల‌ని కోరుతున్నారు.


Also Read: CRPF Recruitment 2023: సీఆర్‌పీఎఫ్‌ నోటిఫికేషన్ రిలీజ్.. ఖాళీల వివరాలు ఇవే.. సింపుల్‌గా అప్లై చేసుకోండి..    


Also Read: Ind Vs Aus 1st Odi Highlights: ఎన్నో అవమానాల మధ్య కేఎల్ రాహుల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్.. తొలి వన్డేలో ఆసీస్ చిత్తు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి