Ind Vs Aus 1st Odi Highlights: ఎన్నో అవమానాల మధ్య కేఎల్ రాహుల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్.. తొలి వన్డేలో ఆసీస్ చిత్తు

India Beat Australia By 5 Wickets: ఎన్నో విమర్శలు.. ఎన్నెన్నో అవమానాలు.. జట్టు నుంచి తొలగించాలని అన్ని వైపులా డిమాండ్స్.. బీసీసీఐ కూడా ఆ దిశగానే చర్యలు ప్రారంభించింది. మొదట వైస్ కెప్టెన్సీ పోస్టు నుంచి తీసేసింది. ఆ తరువాత జట్టు కూడా సాగనంపుతున్నట్లు హింట్ ఇచ్చింది. అయినా అన్ని ఓపిగ్గా భరించిన కేఎల్ రాహుల్ ఒక్క ఇన్నింగ్స్‌తో సమాధానం ఇచ్చాడు. ఆసీస్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2023, 10:11 PM IST
Ind Vs Aus 1st Odi Highlights: ఎన్నో అవమానాల మధ్య కేఎల్ రాహుల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్.. తొలి వన్డేలో ఆసీస్ చిత్తు

India Beat Australia By 5 Wickets: మొదటి వన్డేలో టీమిండియా విజయఢంకా మోగించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్ సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో భారత్ గెలుపొందింది. వైస్ కెప్టెన్సీ కోల్పోయి.. జట్టులో చోటే ప్రశ్నార్థకమైన సమయంలో కేఎల్ రాహుల్ ఎంతో సహనం పాటించి.. సహచరులు అందరూ ఔట్ అయిన చివరి వరకు క్రీజ్‌లో నిలబడి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 188 పరుగులకే ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తడబడింది. చివరికి ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ఆసీస్ మొదట 188 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 189 రన్స్ ఈజీ టార్గెట్‌ను ఛేదించేందుకు చెమటోడాల్సి వచ్చింది. ఇషాన్ కిషన్ (3), శుభ్‌మన్ గిల్ (20), విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్ (0) విఫలమవ్వగా.. హార్ధిక్ పాండ్యా (25) పర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియన్ బౌలర్లు తమ సూపర్ బౌలింగ్‌తో స్వల్ప లక్ష్యాన్ని చాలా కష్టతరం చేశారు.  

టీమిండియా 16 పరుగులకే 3 వికెట్లు.. 39 పరుగులకే 4 వికెట్లు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్.. తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించాడు. హర్ధిక్ పాండ్యాతో కలిసి జట్టును నిలబెట్టిన రాహుల్.. రవీంద్ర జడేజాతో కలిసి భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. రాహుల్-జడేజా 6వ వికెట్‌కు 100కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కేఎల్ రాహుల్ 91 బంతుల్లో 75 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. రవీంద్ర జడేజా 69 బంతుల్లో 45 పరుగులు చేసి కీ రోల్ ప్లే చేశాడు. 

అంతకుముందు జడేజా బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్ మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్‌లను పెవిలియన్‌ బాటపట్టించాడు. మార్నస్ లాబుషెన్‌ను క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్నాడు. దీంతో రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మిచెల్ మార్ష్ (81) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ మొత్తం విఫలమయ్యారు. మహ్మద్ షమీ, సిరాజ్ తలో వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా 2, కుల్దీప్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.  

Also Read: CRPF Recruitment 2023: సీఆర్‌పీఎఫ్‌ నోటిఫికేషన్ రిలీజ్.. ఖాళీల వివరాలు ఇవే.. సింపుల్‌గా అప్లై చేసుకోండి..    

Also Read: Coronavirus: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ ఆరు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News