AP Weather News Updates : పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్‌గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతోంది అని.. ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా. బీ.ఆర్. అంబేద్కర్ తెలిపారు. రేపు ఆదివారం అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో ఆయా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని బి.ఆర్. అంబేద్కర్ తెలిపారు. ఎల్లుండి శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురువనున్నాయి. 


మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదని.. అదే సమయంలో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున చెట్ల కింద నిలబడితే ఈదురు గాలుల ప్రభావంతో చెట్లు కూలే ప్రమాదం కూడా లేకపోలేదని.. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా. బిఆర్ అంబేద్కర్ సూచించారు.