AP Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతుండటంతో గత మూడ్రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీనికి తోడు అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా కేంద్రీకృతం కానుండటంతో మరో మూడ్రోజులు భారీ వర్షాలు తప్పవని ఐఎండీ హెచ్చరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో గత మూడ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా నిన్న శుక్రవారం సైతం మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిలాల్లో భారీగా వర్షం కురిసింది. బాపట్లలో 8 సెంటీమీటర్లు అత్యధిక వర్షపాతం నమోదైంది. ఐఎండీ అంచనాల ప్రకారం  ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ఏర్పడటమే కాకుండా 7వ తేదీ అంటే ఆదివారం నాడు అల్పపీడనం ఏర్పడనుంది. 8వ తేదీకు ఇది వాయగుండంగా బలపడి..ఆ తరువాత తుపానుగా పరివర్తనం చెందవచ్చు.


దక్షిణ కర్ణాటక ఆనుకుని తమిళనాడు మీదుగా ప్రస్తుతం ద్రోణి కొనసాగుతోంది. దాంతో మరో మూడ్రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. 


ఇక కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అదే విధంగా అనంతపురం, శీ సత్యసాయి, కర్నూలు, నంద్యాలలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఓ వైపు అల్పపీడనం మరోవైపు తుపాను హెచ్చరికల నేపధ్యంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తుపాను హెచ్చరికల నేపధ్యంలో 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది. 


ఈ నెల 8వ తేదీన వాయుగుండం తుపానుగా మారితే సీజన్‌లో తొలి తుపాను కానుంది. ఈ తుపానుకు మోచాగా నామకరణం చేయనున్నారు. తుపాను ప్రభావం తగ్గిన తరువాత తిరిగి అంటే ఈ నెల 11వ తేదీ తరువాత రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగి, వడగాల్పులు వీయనున్నాయని అంచనా.


Also read: AP SSC Results 2023: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి, లింక్ వివరాలు ఇవీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook