AP: కరోనా సెకండ్ వేవ్ కచ్చితంగా ఉంటుంది
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఓ వైపు రికార్డు స్థాయిలో పరీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు కొత్త కేసుల సంఖ్య తగ్గుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కరోనా కేసులు ( Corona cases ) తగ్గుముఖం పడుతున్నాయి. ఓ వైపు రికార్డు స్థాయిలో పరీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు కొత్త కేసుల సంఖ్య తగ్గుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఏపీలో కరోనా వైరస్ ( Coronavirus ) కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గుతుండగా...రికవరీ రేటు ( Recovery rate in ap ) క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ ప్రారంభం నుంచి పెద్దఎత్తున నిర్వహిస్తున్న పరీక్షల ఫలితమే ఇదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యల వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు. రాష్ట్రంలో 25 శాతం కేసులు తగ్గాయన్నారు. అదే సమయంలో కొత్త ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయని అన్నారు.
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా రికార్డు స్థాయిలో పరీక్షలు చేస్తోంది ప్రభుత్వం ( Ap Government ) . గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 66 వేల 121 మందికి కోవిడ్ పరీక్షలు ( Covid 19 tests ) నిర్వహించగా.. 5 వేల 487 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. మొత్తం కేసుల సంఖ్య రాష్ట్రంలో 6 లక్షల 81 వేల 161 కు చేరింది. గత 24 గంటల్లో వైరస్ నుంచి 7 వేల 210 మంది కోలుకోగా...మొత్తం 6 లక్షల 12 వేల 3 వందల మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 63 వేల 116 ఉంది. సరిగ్గా 20 రోజుల క్రితం ఈ సంఖ్య 95 వేల వరకూ ఉంది. మరోవైపు ప్రతిరోజూ దాదాపు 70 వేల నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 56 లక్షల 66 వేల పరీక్షలు నిర్వహించి దేశంలోనే టాప్ లో నిలిచింది రాష్ట్రం.
ఇక కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామని జవహర్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 26 కోవిడ్ ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేయగా..అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 17 ఆసుపత్రుల లైసెన్సులు రద్దయ్యాయి.
కచ్చితంగా కరోనా సెకండ్ వేవ్ ( Corona second wave ) కూడా ఉంటుందని కూడా జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పరిస్థితి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లో ఉంటుందన్నారు. అందుకే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనే కేసులు ఎక్కువవుతున్నాయన్నారు. నాన్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో కూడా ర్యాండమ్ సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు.
కంటైన్మెంట్ కానీ ప్రాంతాల్లో కూడా ర్యాండమ్ సర్వే చేస్తున్నామని, రెండోసారి కూడా కరోనా పాజిటివ్ వస్తున్న కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో చాలా చోట్ల జరుగుతుందని, మన రాష్ట్రానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఆయన చెప్పారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కూడా కిట్లు ఇస్తున్నామని, 2 లక్షల కిట్లు కొనుగోలు చేశామని జవహర్‌రెడ్డి వెల్లడించారు. Also read: Chandrababu Naidu: మాజీ సీఎం ఇంటికి మళ్లీ నోటీసులు