APCID: సోషల్ మీడియాలో అనుచిత, అసంబద్ధ పోస్టుల వ్యవహారాన్ని ఏపీ సీఐడీ తీవ్రమైన అంశంగా పరిగణిస్తోంది. ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేతలు ఎవరిపై ఫేక్ పోస్టులు పెట్టినా సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐడీ ఛీఫ్ సంజయ్ హెచ్చరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాపై ఏపీ సీఐడీ నిఘా పెట్టింది. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కుటుంబసభ్యులపై అసభ్యకర పోస్టులు పెరిగిపోయాయి. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ సీఐడీ చర్యలకు ఉపక్రమించింది. అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే అలాంటి సోషల్ మీడియా ఎక్కౌంట్లు కొన్ని గుర్తించామని సీఐడీ ఛీఫ్ సంజయ్ తెలిపారు. కేవలం ముఖ్యమంత్రి, కుటుంబసభ్యులే కాకుండా, ప్రతిపక్షనేతలపై వస్తున్న అనుచిత పోస్టులపై కూడా సంబంధిత ఎక్కౌంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే వారి ఆస్థులు ఎటాచ్ చేస్తామని చెప్పారు. ఇటీవల కొద్దిరోజుల క్రితం న్యాయ వ్యవస్థపై కూడా కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ కొంతమంది పోస్టులు పెట్టారని, అందరిపై చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. 


ఇటీవలి కాలంలో మంత్రులు, మహిళా నేతలపై అసభ్యకర పోస్టులు పెరిగిపోయాయని సీఐడీ వెల్లడించింది. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఎవరిపై అనుచిత పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియాను మంచి విషయాలకు ఉపయోగించుకోవాలని సీఐడీ ఛీఫ్ సంజయ్ విజ్ఞప్తి చేశారు. గత ఏడాది 1450 పోస్టుల్ని, ఈ ఏడాదిలో 2164 అసభ్యకర, అభ్యంతరకర పోస్టుల్ని తొలగించామన్నారు. ఇతర దేశాల్లో ఉండి అశ్లీల, అసభ్యకర పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని, ఆ దేశాల ఎంబసీలతో చర్చించేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాల్ని పంపించామన్నారు. 


న్యాయమూర్తిపై అనుచిత పోస్టుల వ్యవహారంలో 19 మందికి నోటీసులిచ్చామన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న 2,972 మంందిపై సైబర్ బుల్లియింగ్ షీట్స్ ఓపెన్ చేశామన్నారు.


Also read: Chandrababu Eye Operation: ఎల్‌వి ప్రసాద్ ఐ ఆసుపత్రిలో చంద్రబాబుకు కంటి ఆపరేషన్ సక్సెస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook