APCPDCL Pay Power Bill Payment Only Via App discom Website: ఆంధ్ర ప్రదేశ్ లో కూడా విద్యుత్ డిస్కమ్ లు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కరెంట్ బిల్లుల చెల్లింపులను అందరు.. ఫోన్ పే, గూగుల్ పేలు, పేటీఎంల ద్వారా చెల్లించేవారు. ఈ క్రమంలో.. అధికారులు కొన్ని ఆదేశాలు జారీచేశారు. ఇక మీదట.. కరెంట్ బిల్లుల విషయంలో.. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం సహా యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు కుదరవని తెలిపాయి. జులై మాసం నుంచి.. యూపీఐ యాప్‌ల ద్వారా కరెంట్‌ బిల్లుల చెల్లింపులను నిలిపివేశాయి. ఈ క్రమంలో విద్యుత్ వినియోగదారులు.. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి సంబంధిత విద్యుత్‌ డిస్కంలకు సంబంధించి యాప్‌ను మొబైల్‌లో‌ డౌన్‌లోడ్‌ చేసుకొవాలి. ఆ తర్వాత తమకు ఎంతైతే కరెంట్ బిల్లు వచ్చిందో.. ఆ మొత్తంను విద్యుత్ డిస్కం అఫిషియల్ సైట్ లో ద్వారానే చెల్లించాలని సంస్థ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..


డిస్కంలు ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మీదట..విద్యుత్‌ వినియోగదారులు ప్రతినెలా బిల్లు చెల్లింపు కోసం ఆయా డిస్కంల వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. కరెంట్ వినియోగదారులు డిస్కంల యాప్‌/వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.  ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్‌లను ఉపయోగించి బిల్లులు చెల్లించవచ్చు. అంతేకాదు కరెంట్ బిల్లుల్ని డెబిట్, క్రెడిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్, వాలెట్స్, క్యాష్‌ కార్డ్స్‌ ద్వారా బిల్లులు చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉండగా..ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులు (ఏపీసీపీడీసీఎల్‌) గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి సెంట్రల్ పవర్ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా.. డిస్కం వెబ్‌సైట్‌ https://apcpdcl.in/ ద్వారా ఇక మీదట విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని అధికారులు కోరారు.


మరోవైపు.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు,  విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, జిల్లాల పరిధిలోని (ఏపీఈపీడీసీఎల్‌) విద్యుత్ వినియోగదారులు.. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఈస్టర్న్ పవర్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని వివరాలు వెల్లడించారు. డిస్కం వెబ్‌సైట్‌ apeasternpower.com సైట్ ద్వారా బిల్లులు చెల్లించాలన్నారు. 


Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..


ఉమ్మడి చిత్తూరు,  కర్నూలు,  అనంతపురం,  వైఎస్సార్‌ నెల్లూరు జిల్లాల పరిధిలో వినియోగదారులు (ఏపీఎస్‌పీడీసీఎల్) గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి Southern Power యాప్‌/వెబ్‌సైట్‌ www.apspdcl.in ద్వారా బిల్లులు చెల్లించాలని సూచనలు చేశారు. ఈ విధంగా ప్రస్తుతం విద్యుత్ పేమెంట్ కు సంబంధించిన మార్పును గమనించాలని విద్యుత్ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి