ఆంధ్రప్రదేశ్ EAPCET 2021 సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం కోసం తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలోని ఇంజనీరింగ్ , ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకై నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2021(APEAPCET 2021) తొలి విడత సీట్లు కేటాయించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని మొత్తం 437 కళాశాలల్లో కన్వీనర్ కోటాలో 1 లక్షా 11 వేల 304 సీట్లుండగా, 80 వేల 935 మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 30 వేల 369 సీట్లు మిగిలున్నాయి. స్పోర్ట్స్ కేటగరీలో 488, ఎన్‌సీసీ కేటగరీలో 976 మంది విద్యార్ధుల మెరిట్ లిస్ట్ శాప్, ఎన్‌సీసీ డైరెక్టర్ల నుంచి ఇంకా అందాల్సి ఉంది. 


రాష్ట్రంలో ప్రతి ఒక్క కళాశాలకు సీట్లు కేటాయించారు(Seats Allocation). 254 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1 లక్షా 6 వేల 236 సీట్లుండగా.. 80 వేల 520 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 25 వేల 716 సీట్లున్నాయి. 121 బీఫార్మసీ కాలేజీల్లో 4 వేల 386 సీట్లుండగా 352 భర్తీ అయ్యాయి. ఇంకా 4 వేల 34 సీట్లున్నాయి. 62 ఫార్మా-డీ కాలేజీల్లో 682 సీట్లుంటే 63 ఇప్పటికే భర్తీ అయ్యాయి. ఇంకా 619 సీట్లున్నాయి. తొలివిడతలోనే 37 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్నత ప్రమాణాల దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈసారి జీరో కేటాయింపు కాలేజీ ఒక్కటీ లేదు. ప్రమాణాలు పాటించని కళాశాలలకు కౌన్సిలింగ్(Counselling) అనుమతి లభించలేదు. 


రాష్ట్రంలో తొలిసారిగా ప్రైవేటు వర్సిటీల్లో సైతం కన్వీనర్‌ కోటా(Convenor Quota) ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోనిప్రైవేటు వర్సిటీలైన(Private Versities)వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ -అమరావతి, ఎస్‌ఆర్‌ఎం, బెస్ట్‌ యూనివర్సిటీ, సెంచూరియన్‌ యూనివర్సిటీల్లోని ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో(Engineering and Pharma Courses) కన్వీనర్‌ కోటా కింద 2 వేల 12 సీట్లను పేద మెరిట్‌ విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రాతిపదికన కేటాయించారు. ఇతర విద్యార్ధులకు అందినట్టే వీరికి కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ లభిస్తుంది. రాష్ట్రంలో ఏపీ ఈఏపీసెట్‌–2021కు మొత్తం 2 లక్షల 59 వేల 564 మంది దరఖాస్తు చేసుకోగా..1 లక్షా 75 వేల 796 మంది ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు, 83 వేల 51 మంది అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీమ్‌కు దరఖాస్తు చేశారు. తొలిదశ అడ్మిషన్ల కౌన్సిలింగ్‌కు 1 లక్షా 34 వేల 205 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 90 వేల 506 మంది ఆప్షన్ల నమోదుకు అర్హులైతే..89 వేల 898 మంది ఆప్షన్లు ఇప్పటికే నమోదు చేసుకున్నారు. 


Also read: Tirumala Alert : తిరుమల భక్తులకు అలర్ట్... ఆ దారులన్నీ బంద్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook