APEPDCL Recruitment 2021: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది విద్యుత్‌ సంస్థ. విశాఖపట్నం(Visakhapatnam)లోని ఈస్టర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (APEPDCL) గ్రామ, వార్డు సచివాలయాల కింద వివిధ జిల్లాల్లో పనిచేయడానికి 398 ఎనర్జీ అసిస్టెంట్లు(Energy Assistants) (జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌-2) పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ చెక్‌ చేసుకోవాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తం పోస్టులు: 398
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 30, 2021
వెబ్‌సైట్‌: https://apeasternpower.com/ 


Also Read: Online Classes: సిగ్నల్ రావాలంటే..శ్మశానికి వెళ్లాల్సిందే..! ఎక్కడంటే..!


ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఎంపిక చేసిన చోట విధులు నిర్వహించాలి. ఇవే కాకుండా ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు(Jobs) లభిస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో ఆయా రంగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసే పనిలో పడ్డారు అధికారులు. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. 
అలాగే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (Andhra Pradesh State Skill Development Corporation)పలు సంస్థల్లో భారీగా ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. టీసీఎల్, రైసింగ్ స్టార్స్, హీరో మోటార్ గ్రూప్స్, టెక్ టీమ్ సొల్యూషన్స్, వీల్స్ మార్ట్ తదితర ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలున్నాయి. ఈ మేరకు అర్జులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook