Apsrtc Sankranti Special Buses: పండుగలకు ఊరెళ్లుందుకు నెల రోజుల ముందు నుంచే చాలా మంది ప్లాన్ చేసుకుంటారు. ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ ముందుగా బుక్ చేసుకుని.. ఏ రిస్క్‌ లేకుండా హ్యాపీగా వెళ్లిపోవాలని అనుకుంటారు. ఇక సంక్రాంతి రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండుగకు ఇంకా చాలా సమయం ఉన్నా.. టికెట్స్‌కు మాత్రం చాలా డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి ఊరెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్న ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేసినట్లు ప్రకటించింది. http://apsrtconline.in వెబ్‌సైట్‌‌ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు. సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలని సూచించారు. రౌండ్ ట్రిప్ (రాను, పోను) బుక్ చేసుకుంటే టికెట్ ఛార్జీలపై పది శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చని తెలిపారు. త్వరగా బుక్ చేసుకోండి.. సాధారణ ఛార్జీలతో ప్రయాణించండి అని అధికారులు ట్వీట్ చేశారు. 


అదేవిధంగా సంక్రాంతికి భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని స్పెషల్ బస్సులు నడిపేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలు ఉంటాయని చెబుతున్నారు. దసరా పండుగ సమయంలో నడిపిన స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలనే వసూలు చేశారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండుగకు కూడా అదే స్ట్రాటజీని ఉపయోగించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. 


ఇక ఏపీలో త్వరలోనే నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ బస్సులను స్టార్ లైనర్ పేరుతో నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ బస్సులు 2+1 స్లీపర్ కోచ్, 30 కుషన్ సాఫ్ట్ బెర్త్‌‌లు ఉంటాయన్నారు. ఇందులో ఛార్జింగ్ పోర్ట్స్, రీడింగ్ లాంప్స్, లగేజీ ర్యాక్స్, ఆడియో కోచ్‌ సౌకర్యాలు కూడా ఉంటాయి. అయితే ఈ స్టార్ లైన్ బస్సులు ఏయే రూట్లలో ఏ సమయాల్లో నడుస్తాయన్నది క్లారిటీ రావాల్సి ఉంది.


Also Read: Sunny Leone Pics: సన్నీ లియోన్ హాట్ ట్రీట్.. కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తున్న లేటెస్ట్ పిక్స్!  


Also Read: కాటేయడానికి మీదికి దూసుకొచ్చిన భారీ కింగ్ కోబ్రా.. ఈ వ్యక్తి ఎంత ఈజీగా తప్పించుకున్నాడో!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook