Agni 3 Missile: రక్షణశాఖ అమ్ములపొదిలో మరో అస్త్రం, విజయవంతమైన అగ్ని 3 ప్రయోగం

Agni 3 Missile: భారతదేశం మరో ఘనత సాధించింది. అగ్ని 3ను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి గురించి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 24, 2022, 12:23 AM IST
Agni 3 Missile: రక్షణశాఖ అమ్ములపొదిలో మరో అస్త్రం, విజయవంతమైన అగ్ని 3 ప్రయోగం

ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అయిన అగ్ని-3ని విజయవంతంగా ప్రయోగించారు. ఎంపిక చేసిన లక్ష్యాన్ని అగ్ని-3 విజయవంతంగా ఛేదించినట్లు భారత రక్షణ శాఖ తెలిపింది.

భారత రక్షణశాఖ అమ్ములపొదిలో ఇది ఓ మైలురాయిగా చెప్పవచ్చు. స్ట్రాటెజిక్ ఫోర్సెస్ కమాండ్ సాధారణ విధుల్లో భాగంగా మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అయిన అగ్ని-3ను ఇండియా విజయవంతంగా ప్రయోగించింది. ఆశించిన లక్ష్యాన్ని చేధించిందని భారత రక్షణ శాఖ తెలిపింది. అగ్ని క్షిపణి సిరీస్‌లో ఇది మూడవది. అగ్ని-3ను తొలిసారిగా 2006లో ప్రయోగించినప్పుడు విఫలమైంది. క్షిపణి లక్ష్యాన్ని ఛేదించకుండానే ఒడిశా సముద్రంలో పడిపోయింది. ఆ తరువాత 2007లో రెండవసారి విజయవంతంగా ప్రయోగించారు. ఇక 2008లో కూడా అగ్ని క్షిపణి ప్రయోగం సఫలమైంది. 

అగ్ని-3 క్షిపణి అణు వార్‌హెడ్‌ను కూడా మోసుకెళ్లే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. అదే విధంగా 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారై విజయవంతమైన క్షిపణి కావడం విశేషం.

Also read: Ayyappa Devotees, Irumudi Kettu: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. విమానంలో ఇక ఇబ్బంది లేదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News