అమరావతి: టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ మద్దతు ఉంటుందని ఇదివరకే ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసి కార్మిక సంఘాల జేఏసి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టిఎస్ఆర్టీసికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని విమర్శించిన జేఏసీ నాయకులు.. టి సర్కార్ తీరుకు నిరసనగా ఏపిఎస్ఆర్టీసి జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోల ఎదుట మొదటి దశగా ఆందోళన చేపడతామని ప్రకటించారు. ఏపీలోనూ ధర్నాల ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏపీఎస్ఆర్టీసి కార్మికులు అందరూ సిద్ధంగా ఉండాలని ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. 


ఏపిఎస్ఆర్టీసి చెప్పినట్టుగానే సమ్మెకు దిగినట్టయితే, టిఎస్ఆర్టీసి సమ్మెలో మరో కీలక ఘట్టం చోటుచేసుకున్నట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు.