Attack on Chandrababu Naidu: చంద్రబాబు నాయుడిపై రాళ్ల దాడి.. సీఎస్ఓ మధుబాబుకు గాయాలు
Attack on Chandrababu Naidu: ఎన్టీఆర్ నందిగామ జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు రోడ్డు షోలో పాల్గొన్నారు.
Attack on Chandrababu Naidu: చంద్రబాబు ఓపెన్ టాప్ వాహనంపై నిలబడి మాట్లాడుతున్న క్రమంలోనే గుర్తుతెలియని వ్యక్తి చంద్రబాబుపైకి రాయి విసిరాడు. ఆ రాయి చంద్రబాబుకు తగలకుండా ఆ పక్కనే నిలబడి ఉన్న చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ మధుబాబుకు తగిలింది. గడ్డం కింది భాగంలో రాయి తగలడంతో మధుబాబుకు గాయమైంది. రక్తం కారుతుండటంతో అక్కడే ఉన్న వైద్యుల బృందం వెంటనే మధుబాబుకు ప్రథమ చికిత్స అందించారు.
చంద్రబాబుపై దాడి నేపథ్యంలో ఆయన భద్రతా వలయంలోని ఎన్ఎస్జీ కమాండోలు అప్రమత్తమయ్యారు. చంద్రబాబుకు భద్రత పెంచి రోప్ పార్టీని కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఉద్రిక్తతలకు తావులేకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా రోడ్ షోను త్వరగా ముగించాల్సిందిగా పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చారు.
రాయి విసిరిన ఘటనపై చంద్రబాబు స్పందన
రాజకీయంగా సమాధానం చెప్పలేకే పులివెందుల తరహాలో రాజకీయాలు చేసి దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కావాలనే తనకు పోలీసుల భద్రత తగ్గించి వైసీపీ రౌడీలను ప్రోత్సహించి దాడులకు పాల్పడేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్ జగన్ పరిపాలనలో భవిష్యత్తు ఉండదన్న చంద్రబాబు నాయుడు.. టీడీపీయే మీ పిల్లలకు సరైన భవిష్యత్తు అందిస్తుందని అన్నారు. వైఎస్ జగన్ పాలనలో నిత్యావసరాల ధరలతో పాటే ఇసుక, మద్యం, కుంభకోణాలు కూడా పెరిగాయని అసహనం వ్యక్తంచేశారు.
Also Read : Pawan Kalyan: కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుంది.. పవన్ కళ్యాణ్ జోస్యం
Also Read : Pawan Kalyan: పవన్ కల్యాణ్ హత్యకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారా?
Also Read : Minister KTR: సీఎం జగన్ నా బెస్ట్ ఫ్రెండ్.. ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్ రియాక్షన్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook