Ayush Report: కరోనా మహమ్మారిని నయం చేసేందుకు ఆనందయ్య ఇస్తున్న మందుపై నివేదిక సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయుష్ శాఖ నివేదిక సమర్పించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నంలో సాంప్రదాయ ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న కరోనా మందు (Anandaiah corona medicine)దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మందు శాస్త్రీయతపై సందేహాల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై..తాత్కాలికంగా పంపిణీ నిలిపివేసింది. ఆయుష్, సీసీఆర్ఏఎస్‌ను రంగంలో దింపి అధ్యయనానికి ఆదేశించింది. ఇప్పటికే ఆయుష్ (Ayush) వైద్యబృందం అధ్యయం పూర్తయింది. నివేదికను ( Ayush Report on Krishnapatnam medicine) ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ( Ap cm ys jagan) సమర్పించారు ఆయుష్ కమీషనర్ రాములు.


ఆనందయ్య మందు వల్ల ఎటువంటి ప్రమాదం లేదని ఆయుష్ కమీషనర్ రాములు తేల్చిచెప్పారు. పూర్తి నివేదిక వచ్చిన తరువాత ప్రజలకు మందును పంపిణీ చేయవచ్చని తెలిపారు. మూడు నాలుగు రోజుల అనంతరం తుది నివేదిక వస్తుందని చెప్పారు. సీసీఆర్ఏఎస్ నివేదిక (CCRAS Report) వచ్చి తరువాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం(Ap government) తీసుకుంటుందన్నారు. ఆనందయ్య ఇప్పటికే 70-80 వేల మందికి మందు పంపిణీ చేశారని..వేల సంఖ్యలో తీసుకున్నప్పుడు ఒకరిద్దరికి సమస్యలు రావచ్చని చెప్పారు. దీన్ని పెద్ద సమస్యగా చిత్రీకరించాల్సిన అవసరం లేదన్నారు. 


Also read: Ap Corona Update: ఏపీలో తగ్గుతున్న కరోనా ఉధృతి, 24 గంటల్లో 12 వేల కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook