Badvel Bypoll Results: తెలంగాణ హుజారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఏపీ బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. బద్వేలు ఉపఎన్నిక కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి(Badvel Bypoll)అక్టోబర్ 30వ తేదీన జరిగిన ఉపఎన్నిక కౌంటింగ్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. బద్వేలులో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం బరిలో లేకపోవడం విశేషం. అటు బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధి, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) అభ్యర్ధులు బరిలో నిలిచారు. కోవిడ్ మార్గదర్శకాల్ని అనుసరించి భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. బద్వేలు ఉపఎన్నిక కౌంటింగ్ నాలుగు కేంద్రాల్లో 12 రౌండ్లలో జరగనుంది. ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రంలో ఏడు టేబుల్స్ ఏర్పాటయ్యాయి. ప్రతి కేంద్రంలో ఆర్‌ఓ, ఏఆర్‌ఓలకు ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఆర్‌ఓ ఉన్న కౌంటింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్లను ముందుగా లెక్కిస్తారు. ర్యాండమ్ చెక్ కోసం ఒక వీవీ ప్యాట్ కేంద్రం ఏర్పాటైంది.


ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఒక సూపర్ వైజర్‌తో పాటు అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. బద్వేలు తుది ఫలితం మద్యాహ్నం 12 గంటల వరకూ(Badvel Bypoll Results)వెలువడే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకూ సర్వీసు ఓటర్లు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల ఓట్లు 235 వరకూ ఉన్నాయి. ఓట్లు లెక్కించే సమయానికి మరికొన్ని చేరితే వాటిని కూడా లెక్కపెట్టనున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 15 వేల 240 ఓట్లుండగా, 1 లక్షా 47 వేల 213 ఓట్లు పోలయ్యాయి. అంటే కేవలం 68.39 శాతం పోలింగ్ నమోదైంది. ఏపీలోని బద్వేలు, తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలతో పోలిస్తే..దేశవ్యాప్తంగా 27 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు కూడా అదే రోజు అంటే అక్టోబర్ 30వ తేదీన ఉపఎన్నికలు జరిగాయి. 


Also read: Huzurabad Bypoll Results 2021: హుజూరాబాద్ ఫలితం తేలేది ఎన్నిగంటలకో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి