కాపు రిజర్వేషన్లపై భగ్గుమన్న బీసీ సంఘాలు
ఏపీ అసెంబ్లీలో కాపులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ (విద్యా, ఉపాధి రంగాల్లో మాత్రమే) తీర్మానం చేయడంపై బీసీ సంఘాలు మండిపడ్డాయి. అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
ఏపీ అసెంబ్లీలో కాపులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ (విద్యా, ఉపాధి రంగాల్లో మాత్రమే) తీర్మానం చేయడంపై బీసీ సంఘాలు మండిపడ్డాయి. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు 5% రిజర్వేషన్లు ఎలా అమలుచేస్తారో చెప్పాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు రోడెక్కారు. అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన కాపులను బీసీ జాబితాలో చేర్చడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీ సంఘాలు ఆరోపించారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని ఖండిస్తున్నా: ఆర్. కృష్ణయ్య
బీసీ ఉద్యమ నేత, టీ-టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కాపులను బీసీల్లో చేర్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపులను 5% రిజర్వేషన్ కల్పించడం వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. దీనిపై తాము న్యాయపరమైన పోరాటానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.