దేశవ్యాప్తంగా 12 మంది గవర్నర్లను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ చేసిన కేంద్రం..ఏపీకు కొత్త గవర్నర్‌ను నియమించింది. ఏపీ కొత్త గవర్నర్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎస్ అబ్దుల్ నజీర్‌ను నియమించింది కేంద్రం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వచ్చే ఏడాది 2024 ఎన్నికల నేపధ్యంలో దేశవ్యాప్తంగా గవర్నర్ల నియామకం జరిగింది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీ కొత్త గవర్నర్‌గా ఎస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. ఇక మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా శివప్రసాద్ శుక్లా, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా త్రివిక్రమ్ పట్నాయక్, జార్ఘండ్ గవర్నర్‌గా రాధాకృష్ణన్, అస్సోం గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా, మణిపూర్ గవర్నర్‌గా అనసూయ, బీహార్ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్, లడఖ్ గవర్నర్‌గా బీడీ మిశ్రా, నాగాలాండ్ గవర్నర్‌గా గణేషన్, మేఘాలయ గవర్నర్‌గా చౌహాన్, ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్‌లను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఒకేసారి భారీ ఎత్తున గవర్నర్‌లను మార్చడం చర్చనీయాంశంగా మారింది. 


Also read: Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, ఈ నెల 16 కీలకం కానుందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook