Tirupati Stampede: తిరుపతిలో విషాదం.. వైకుంఠ ద్వార టికెట్లలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి
వైకుంఠ ద్వార దర్శన టికెట్ల పంపిణీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్యూలైన్‌లలో భారీగా భక్తులు రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుని మహిళా భక్తురాలు మృతి చెందింది. పలువురు భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతోపాటు స్థానిక పోలీసులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన సంచలనంగా మారింది.
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శన టికెట్ల పంపిణీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్యూలైన్‌లలో భారీగా భక్తులు రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుని నలుగురు భక్తులు మృతి చెందారు. పలువురు భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతోపాటు స్థానిక పోలీసులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన సంచలనంగా మారింది.
Also Read: Narendra Modi: 'చంద్రబాబు, పవన్‌తో భుజం భుజం కలిసి పని చేస్తాం': ప్రధాని మోదీ
వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు కోసం తిరుపతిలో పలుచోట్ల టికెట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్దకు వేల సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. బైరాగి పట్టిడ పార్కు వద్ద క్యూలోకి భక్తులను అనుమతించడంతో ఒక్కసారిగా భక్తులు దూసుకొచ్చారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకోగా కొంతమంది భక్తులు కిందపడిపోయారు. వారిపై నుంచి మిగతా భక్తులు తొక్కుకుంటూ వెళ్లడంతో భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్రీనివాసం వద్ద తొక్కిసలాట జరిగి మల్లికా అనే భక్తురాలు మృతిచెందినట్లు సమాచారం. విష్ణు నివాసం వద్ద కూడా ఇదే తరహా సంఘటన చోటుచేసుకుంది.
Also Read: Narendra Modi Visit: ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ భారీ కానుక.. రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు
వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు కోసం తిరుపతిలో పలుచోట్ల టికెట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్దకు వేల సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. బైరాగి పట్టిడ పార్కు వద్ద క్యూలోకి భక్తులను అనుమతించడంతో ఒక్కసారిగా భక్తులు దూసుకొచ్చారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకోగా కొంతమంది భక్తులు కిందపడిపోయారు. వారిపై నుంచి మిగతా భక్తులు తొక్కుకుంటూ వెళ్లడంతో భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్రీనివాసం వద్ద తొక్కిసలాట జరిగి మల్లికా అనే భక్తురాలు మృతిచెందినట్లు సమాచారం.
తిరుమల వెంకటేశ్వర ఆలయంలో ఈనెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు మొదలుకానున్నాయి. ఈ దర్శనాల కోసం తిరుపతి స్థానికుల కోసం టికెట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ టికెట్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలో కొన్ని టికెట్ కేంద్రాల వద్ద భక్తులు బారులు తీరడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో నలుగురు మృతి చెందగా 25 మంది భక్తులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారని సమాచారం. అస్వస్థతకు గురయిన భక్తులను ఆస్పత్రికి తరలించారు. అయితే కొందరు భక్తుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఏర్పాట్లలో టీటీడీ విఫలం
వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లలో తిరుమతి తిరుపతి దేవస్థానం.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌లో విడుదల చేసిన టికెట్‌లు భక్తులకు దక్కలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక తిరుపతి స్థానిక ప్రజలకు అందించేందుకు ఏర్పాటుచేసిన టికెట్ కేంద్రాల వద్ద టీటీడీ పటిష్ట చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం, టీటీడీ పటిష్ట చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ విషాద సంఘటన చోటుచేసుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సంఘటన రాజకీయంగా వివాదం రాజుకోనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.