PM Modi AP Visit: మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత రెండోసారి ఏపీకి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ కానుకలు ఇవ్వనున్నారు. ఏకంగా 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బుధవారం ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జాతర జరగనుంది. మోదీ పర్యటనతో ఏపీ అభివృద్ధికి... ఆర్థిక అభివృద్ధికి భారీ ఊతం లభించనుంది. దీంతో ఏపీ దశదిశ మారుతుందని ఎన్డీయే కూటమి నాయకులు భావిస్తున్నారు.
Also Read: KT Rama Rao: నాకు ఉరిశిక్ష పడ్డట్టు కాంగ్రెసోళ్ల సంబరాలు ఎందుకు? నేను అవినీతి చేయలేదు
సుస్థిరాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం దాదాపు రూ.2 లక్షల కోట్లతో పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విశాఖపట్నం సమీపంలోని పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఇదే మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు కావడం విశేషం. ఈ ప్రాజెక్టు పెట్టుబడి దాదాపు రూ.1,85,000 కోట్లు.
Also Read: KT Rama Rao: నాకు ఉరిశిక్ష పడ్డట్టు కాంగ్రెసోళ్ల సంబరాలు ఎందుకు? నేను అవినీతి చేయలేదు
జాతికి అంకితం చేసే పనులు.. ప్రాజెక్టులు ఇవే!
- ఆంధ్రప్రదేశ్‌లో రూ.19,500 కోట్ల విలువైన వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను ప్రధానమంత్రి మోదీ జాతికి అంకితం చేయనున్నారు. రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విశాఖపట్నంలో దక్షిణ తీర రైల్వే ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు.
- అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఔషధ పార్కుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది.
- విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం-కాకినాడ పెట్రోలియం, రసాయన, పెట్రో కెమికల్ పెట్టుబడి ప్రాంతానికి సమీపంలో ఉండడంతో ఆర్థిక వృద్ధి వేగవంతం కావడానికి దోహదపడుతుంది.
- చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి (కేఆర్ఐఎస్ సిటీ) కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం ద్వారా చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పర్యావరణహిత అధునాతన పారిశ్రామిక నగరంగా ఇది రూపొందనుంది. తయారీ రంగంలో దాదాపు రూ.10,500 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ ప్రాజెక్టు సిద్ధంగా ఉంది. జీవనోపాధిని గణనీయంగా పెంపొందించడంతోపాటు ప్రాంతీయ పురోగతికి ఈ ప్రాజెక్టు చోదకంగా నిలుస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.