YSRCP vs TDP Twitter War: వైసిపి వర్సెస్ టిడిపి.. ట్విట్టర్ వార్ మొదలయ్యింది. నిన్న మధ్యాహ్నం రేపు 12 గంటలకు బాంబు ఎక్స్పోజ్ అని ప్రకటించిన రెండు పార్టీలు.. అందుకు తగ్గట్టుగానే పోస్టులు చేశాయి. ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వైసిపి పార్టీ.. తరపున ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ..175 స్థానాలలో పోటీ చేయగా ఈయనకు పోటీగా కూటమిగా టిడిపి, జనసేన, బిజెపి ఏర్పడి 175 స్థానాలలో పోటీ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐకమత్యమే మహాబలం అన్నట్టు గుంపుగా పోటీ చేశారు కాబట్టి ఓట్లు పక్కకి చీలకుండా.. ఆధిపత్యం సాధించారు అంటూ వైసీపీ వారు తమ బాధని వ్యక్తపరిచిన సంగతి కూడా తెలిసిందే. ఏదేమైనా.. మొత్తం 164 సీట్లు సాధించి కూటమి.. ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చింది. కాగా..ఎప్పటికప్పుడు గత ప్రభుత్వ హయాంలో వైసిపి చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం వేలెత్తి చూపించింది. 


అయితే ఇదంతా ఇలా ఉండగా నిన్న మధ్యాహ్నం.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు.. ట్రూత్ బాంబ్ అంటూ ఉత్కంఠ రేకెత్తించిన వైసీపీ..చెప్పినట్లుగానే సరిగా  12 గంటలకు ట్వీట్ చేసింది. అటు టిడిపి కూడా పోస్ట్ చేసినా అందరూ.. వైసిపి పోస్ట్ కోసమే ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలోబే సరిగ్గా ఈరోజు 12 గంటలకు వైసీపీ పార్టీ ట్వీట్ చేయగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . 


మీడియా ముసుగు వేసుకొని డ్రగ్స్ మాఫియా.. నడిపే వారికి టీటీడీ చైర్మన్ పదవులా..? గత కొన్ని సంవత్సరాలుగా ఈ 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత సాక్షాలు ఇవిగో అంటూ కొన్ని పత్రాలను కూడా జోడించడం జరిగింది. 
 



 


ఇక సాక్షాలతో సహా నిరూపించడంతో ఎల్లో మీడియా అధినేత ఎక్కడ తల దాచుకుంటారు అంటూ కొంతమంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా నేటిజన్స్ వైసిపి పేల్చిన ట్రూత్ బాంబుకి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 


మరి దీనిపై ఎల్లో మీడియా అధినేత ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి . దీనికి తోడు తిరుపతి లడ్డు వివాదంలో వైసిపి పార్టీ తప్పు లేకపోయినా ఆ పార్టీదే తప్పు అంటూ ఎత్తిచూపే ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం.  అందులో భాగంగానే అప్పటివరకు ఉన్న టిటిడి ఉద్యోగస్తులను కూడా దాదాపు తొలగించారని వార్తలు కూడా వినిపించాయి. మరి వైసిపి పేల్చిన ఈ బాంబుకి కూటమి ప్రభుత్వం ఏ విధంగా సమాధానం ఇస్తుందో చూడాలి.


 


 




 


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


Read more: KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్‌


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.