Janasena: పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాలతో ఆ పార్టీ ఏకంగా గుర్తునే కోల్పోయింది. మొన్నటి వరకూ ఆ పార్టీకు చిహ్నంగా ప్రాచుర్యం పొందిన గాజు గ్లాసు లేదా టీ గ్లాసు గుర్తును పార్టీ కోల్పోయింది. కేంద్ర ఎన్నికల కమీషన్ ఆ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో చేరుస్తూ ప్రకటన విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాల్ని ఎన్నికల కమీషన్ వెల్లడించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశంలో ఏపీతో పాటు తెలంగాణలో కూడా గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో ఎంఐఎం, బీఆర్ఎస్ సరసన చేరాయి. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీలకు గతంలో కేటాయించిన గుర్తులే ఉంటాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన మాత్రం గాజు గ్లాసు గుర్తును కోల్పోయింది. ఎన్నికల కమీషన్ గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చేసింది. ఇది పార్టీకు తీవ్ర నష్టమేనని చెప్పవచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఎన్నికల కమీషన్ జనసేన పార్టీకు గాజు గ్లాసు కేటాయించినప్పటి నుంచి ప్రజల్లో మంచి ప్రాచుర్యమే లభించింది. గాజు గ్లాసు కన్పించిందంటే జనసేన పార్టీగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అటు సినిమాల్లో కూడా పవన్ గాజు గ్లాసు పట్టుకుని యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ ట్రెండ్ చేశారు. ఇప్పుడు ఒక్కసారిగా ఆ పార్టీకు ఆ గుర్తు లేకపోవడం అతి పెద్ద సమస్య కానుంది.


జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును కోల్పోవడం వెనుక పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాలే కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే వరుసగా ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో జనసేన దూరంగా ఉండటం వల్లనే ఆ పార్టీ గుర్తు కోల్పోయింది. ఎన్నికల్లో పోటీ చేసే ఏ రాజకీయ పార్టీ అయినా గుర్తును స్థిరంగా ఉంచుకోవాలంటే ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు నిబంధనల మేరకు నిర్ణీత శాతం ఓట్లు పొందాలి. ఇందుకు భిన్నంగా పలు ఉపఎన్నికలకు దూరంగా ఉండటంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తక్కువ చోట్ల పోటీ చేసింది. ఫలితంగా ఇప్పుడు గుర్తును కోల్పోయింది.


కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. వాస్తవానికి ఏడాది క్రితం జరిగిన బద్వేలు ఉపఎన్నిక సమయంలోనే జనసేన గుర్తు కోల్పోయింది. ఆ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు వేరే పార్టీకి దక్కింది. ఇప్పుడు అధికారికంగా గుర్తును తొలగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏడాది సమయం కూడా లేని సార్వత్రిక ఎన్నికలకు జనసేన పార్టీకు పెద్ద ఇబ్బందే కలగవచ్చు. అదృష్టం తోడై గాజు గ్లాసు సింబల్ కామన్ కోటాలో లభిస్తే ఫరవాలేదు.. కానీ ఒక్కో చోట లభించి ఒక్కో చోట లభించకపోతే ప్రమాదమే. 


Also read: AP Govt Good News: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్,, దానిపై నిషేధం ఎత్తివేత!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook