Satyavedu mla adimulam romance incident news: ఆంధ్ర ప్రదేశ్ లో ఒకవైపు వరదలు ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి.  ముఖ్యంగా విజయవాడ వరద ప్రభావానికి గురైందని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా.. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా తన వంతుగా ప్రజలకు సహాయం చేస్తుంది. సీఎం చంద్రబాబు పదిరోజులుగా విజయవాడ కలెక్టర్ కార్యలయంలోనే ఉంటూ.. సహాయక చర్యలను దగ్గరుండి మరీ చూస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా.. ఏపీలో కొన్నిరోజులుగా కొంత మంది రాజకీయ నాయకులు తరచుగా వివాదాల్లో ఉంటున్నారు. మెయిన్ గా... మహిళలతో రోమాన్స్ చేసుకుంటూ అడ్డంగా దొరికి పోయిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ప్రస్తుతం.. సత్యవేడు ఎమ్మెల్యే  సొంత పార్టీ నాయకులితో రోమాన్స్ చేసిన ఘటన హాట్ టాపిక్ గా మారింది.


పూర్తి వివరాలు..


సత్యేవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తనపై అత్యాచారం చేశాడని కూడా.. తెలుగు మహిళా మండల అధ్యక్షురాలు వరలక్ష్మి ఆరోపించారు. తిరుపతిలోకి ఒక గెస్ట్ హౌస్ కు రప్పించి మూడు పర్యాయాలు అత్యాచారం చేశాడని తెలిపింది. అంతేకాకుండా.. ఆమె తన భర్తతో హైదరాబాద్ కు సైతం వచ్చి సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం సైతం ఏర్పాటు చేసి, తనకు జరిగిన అన్యాయం గురించి వాపోయింది. మరోవైపు ఈ ఘటన దుమారంగా మారడంతో సీఎం చంద్రబాబు ఈ ఘటనపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.


వెంటనే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని కూాడా ఆదేశించారు.  మరోవైపు ఆదిమూలం ఒక్కసారిగా హెల్త్ బాగాలేదని కూడా  చెన్నైలోని ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ ఘటనసై కేసు నమోదు చేసుకున్న చెన్నై పోలీసులు.. సదరు బాధితురాలని వైద్య  పరీక్షల కోసం రావాల్సిందిగా పలుమార్లు చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఆమె మాత్రం.. తన హెల్త్ బాగోలేదని తనకు కొంత గడుపు కావాలని కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు.. 



 రెండు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చిన ఆమె తనకు రాజకీయంగా ఎలాంటి సపోర్టు లేదని, తనకు భయమేస్తోందని చెప్పారు. తాను సూసైడ్ చేసుకుంటానంటూ కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ లు సైతం పెట్టినట్లు తెలుస్తోంది. 


ఈ క్రమంలో.. ఆమెను ఎవరైనా బెదిరించారా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇదిలా వుంటే, ఆదిమూలం మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ మీద సత్యవేడు ప్రాంతంలోని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న ఆదిమూలం లాంటి దళిత నాయకుడిని తొక్కేయడానికే ఆ మహిళ ఇలాంటి ఆరోపణలు చేస్తూ, కేసు పెట్టిందని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.


Read more: Radhika merchant: అంబానీ కోడలా.. మజాకా.. తీన్మార్ స్టెప్పులతో దుమ్మురేపిన రాధిక మర్చంట్.. వీడియో వైరల్..


అంతేకాకుండా.. సదరు మహిళ మీదనే.. తిరుపతి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో వారు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో కొంత మంది నాయకులు దీనిపై  ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 72 ఏళ్ల వయస్సులో కావాలని ఇలా ఇరికించారంటూ కూడా.. ఆదిమూలంకు స్థానికులు సపోర్ట్ చేస్తున్నారు. ఇలా సత్యవేడు ఘటనలో..  ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.