Tirupati Temple Stampede: యావత్‌ దేశాన్ని.. హిందూ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరుగురు భక్తులు మృతి చెందడంతోపాటు పదుల సంఖ్యలో గాయపడడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది. ముగ్గురు అధికారులను సస్పెండ్‌ చేయగా.. ఒక అధికారిపై బదిలీ వేటు వేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tirupati Stampede: 'ఏడుకొండలు వాడా... స్వామి మమ్మల్ని క్షమించు'


తిరుపతి ఎస్పీగా ఉన్న సుబ్బరాయుడు, తిరుపతి జేఈఓ గౌతమి, డీఎస్పీ రమణకుమార్‌ సస్పెండ్‌ చేశారు. సీఎస్‌ఓ శ్రీధర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. గోశాల డైరెక్టర్‌ హరనాథ్‌ రెడ్డిని కూడా సస్పెండ్‌ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. తొక్కిసలాటకు కారణమై విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. డీఎస్పీ రమణ కుమార్‌ బాధ్యత లేకుండా పని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు.


Also Read: Tirupati Temple Stampede: తిరుపతిలో ఘోర విషాదం.. ఏడుకు పెరిగిన మృతుల సంఖ్య


బాధిత కుటుంబాలకు ఆపన్నహస్తం
తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఆపన్న హస్తం అందించారు. 'మృతి చెందిన ఆరుగురు కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి కాంట్రాక్ట్‌ ఉద్యోగం ఇస్తాం' సీఎం చంద్రబాబు ప్రకటించారు. 'తీవ్ర గాయాలైన తిమ్మక్క, ఈశ్వరమ్మకు రూ.5 లక్షల చొప్పున సహాయం చేస్తాం. గాయపడిన 33 మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున సహాయం అందిస్తాం' అని వివరించారు.


తిరుమల పవిత్రత కాపాడే బాధ్యత తీసుకుంటానని సీఎం చంద్రబాబు తెలిపారు. 'మన అసమర్థత వల్ల దేవుడికి చెడ్డ పేరు రాకూడదు. ఇక్కడ రాజకీయాలు చేయడానికి వీలు లేదు. ఏ ఆలయంలోనూ అపచారం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. పవిత్ర దినాల్లో దర్శనాలు సజావుగా చేయించాల్సిన బాధ్యత అధికారులదే' అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.