హైదరాబాద్: బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఇవాళ మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయనతో భేటీ అయ్యారు ( Somu Veerraju meets Chiranjeevi ). ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడిగా ఎంపికైన సోము వీర్రాజు.. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఇలా చిరంజీవిని కలవడం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐతే, ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ మాత్రమే అని ఇరువర్గాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. Also read: Plasma therapy: ప్లాస్మాతో ప్రయోజనం లేదా ? ఢిల్లీ ఎయిమ్స్ సంచలన ప్రకటన


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"189695","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఈ సందర్భంగా సోము వీర్రాజుకి శాలువా కప్పి సత్కరించిన చిరంజీవి.. రాష్ట్ర బీజేపి అధ్యక్షుడిగా ఎంపికైనందుకు అభినందనలు తెలియజేశారు. అంతేకాకుండా ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తన సోదురుడు, జనసేనాని పవన్ కల్యాణ్‌తో ( Pawan Kalyan ) కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిందిగా సోము వీర్రాజును చిరంజీవి కోరినట్టు సమాచారం. Also read: BJP in AP: రాజధాని విషయంలో బీజేపి వైఖరి ఇదే