Plasma therapy: ప్లాస్మాతో ప్రయోజనం లేదా ? ఢిల్లీ ఎయిమ్స్ సంచలన ప్రకటన

ప్లాస్మా థెరపీతో కొవిడ్-19కి చెక్ పెట్టొచ్చని ( COVID-19 ) అందరూ భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఢీల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి ఓ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. కొవిడ్ -19 రోగులలో మరణాల ప్రమాదాన్ని ( Mortality risk ) తగ్గించడంలో ప్లాస్మా థెరపీ ప్రయోజనం చూపించలేదని ఢిల్లీ ఎయిమ్స్ ( Delhi AIIMS ) తెలిపింది.

Last Updated : Aug 6, 2020, 06:16 PM IST
  • ప్లాస్మా థెరపీతో కొవిడ్-19కి చెక్ పెట్టొచ్చని ( COVID-19 ) అందరూ భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఢీల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి సంచలన ప్రకటన
  • కొవిడ్ -19 రోగులలో మరణాల ప్రమాదాన్ని ( Mortality risk ) తగ్గించడంలో ప్లాస్మా థెరపీ ప్రయోజనం చూపించలేదని తెలిపిన ఢిల్లీ ఎయిమ్స్
  • ప్లాస్మా థెరపి చికిత్సా విధానం సామర్థ్యాన్ని అంచనా వేయడం కోసం జరిపిన ప్రయోగాల మధ్యంతర ఫలితాలను వెల్లడించిన ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ డా రణదీప్ గులేరియా
Plasma therapy: ప్లాస్మాతో ప్రయోజనం లేదా ? ఢిల్లీ ఎయిమ్స్ సంచలన ప్రకటన

న్యూ ఢిల్లీ: ప్లాస్మా థెరపీతో కొవిడ్-19కి చెక్ పెట్టొచ్చని ( COVID-19 ) అందరూ భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఢీల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి ఓ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. కరోనావైరస్ రోగులలో మరణాల ప్రమాదాన్ని ( Mortality risk ) తగ్గించడంలో ప్లాస్మా థెరపీ ప్రయోజనం చూపించలేదని ఢిల్లీ ఎయిమ్స్ ( Delhi AIIMS ) తెలిపింది. ప్లాస్మా థెరపి చికిత్సా విధానం సామర్థ్యాన్ని అంచనా వేయడం కోసం జరిపిన ప్రయోగాలను విశ్లేషించిన అనంతరం ఈ ఫలితం తేలినట్టు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ డా రణదీప్ గులేరియా ( AIIMS Director Dr Randeep Guleria ) స్పష్టంచేశారు. Also read: Health tips: ఉప్పు ఎక్కువ తింటున్నారా ? ఐతే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు
 
Plasma therapy అసలు ప్లాస్మా థెరపీ చికిత్స అంటే ఏంటి ?
ప్లాస్మా థెరపి చికిత్స అంటే.. కరోనావైరస్ నుండి కోలుకున్న వ్యక్తి నుంచి సేకరించిన రక్తం నుండి యాంటీబాడీస్ ( Antibodies ) వేరు చేసి, వాటిని ప్రస్తుతం కరోనావైరస్ సోకిన రోగికి ఎక్కించడం ద్వారా శరీరంలో కరోనావైరస్‌కి వ్యతిరేకంగా పోరాడటానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంచడం. తద్వారా కరోనా రోగిని ఆ వ్యాధి నుంచి రక్షించవచ్చని ప్లాస్మా థెరపినీ ప్రోత్సహించే శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెబుతున్నారు. Also read: 
మీ ప్యాకెట్ పాలు Coronavirus నుండి సురక్షితమేనా ?

30 కోవిడ్ -19 రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా యాంటిబాడీస్ ఎక్కించినప్పటికీ.. మరణాల రేటును నివారించడంలో స్పష్టమైన ఫలితాలు కనిపించలేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా గురువారం వెల్లడించినట్టు పీటీఐ పేర్కొంది. 

ప్లాస్మా థెరపీ సమయంలో, ఒక సమూహంలోని రోగులకు యధావిధిగా ఇచ్చే కొవిడ్-19 చికిత్సతో పాటు ప్లాస్మా థెరపి చికిత్స కూడా ఇవ్వడం జరిగింది. అదే సమయంలో మరొక సమూహంలోని రోగులకు కేవలం కొవిడ్-19 చికిత్సను మాత్రమే ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ రెండు గ్రూపుల్లో నమోదైన మరణాల సంఖ్య సమానంగానే ఉందని, అలాగే ప్లాస్మా థెరపి తీసుకున్న రోగుల ఆరోగ్య పరిస్థితిలోనూ ఆశించినంత మెరుగుదల కనిపించలేదని డా గులెరియా తెలిపారు. Also read: How to check BP: హై బీపీకి చెక్ పెట్టే ఫుడ్స్ ఇవే

ఐతే ప్రస్తుతం ఈ ప్రయోగాలు మధ్యలోనే ఉన్నాయని.. ఇంకొంత మంది కరోనావైరస్ సోకిన రోగులకు ఈ ప్లాస్మా థెరపి ఇచ్చి పూర్తి స్థాయి ఫలితాలను విశ్లేషించాల్సిన అవసరం ఉందని డా రణదీప్ గులెరియా స్పష్టంచేశారు. 

ప్లాస్మా భద్రతను పరీక్షించాల్సిన అవసరం ఉందని.. COVID-19 రోగులకు ఎక్కించే ప్లాస్మాలో ఆ రోగికి ఉపయోగపడే స్థాయిలో యాంటీబాడీలు కూడా ఉండాలని ఆయన ఒక్కినొక్కానించి చెప్పారు. Also read: Jackfruit benefits: పనస పండుతో ప్రయోజనాలు.. మాంసాహారానికి మంచి ప్రత్యామ్నాయం

"ప్లాస్మా సురక్షితం. దాని సమర్థత విషయానికొస్తే.. దానిపై ఇంకా సరైన స్పష్టత లేదు కనుక ప్లాస్మా థెరపీని ప్రయోగించే విషయంలో చట్టబద్ధత, జాతీయ మార్గదర్శకాలకు లోబడి ఉండాల్సిన అవసరం ఉంది" అని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి మెడిసిన్ విభాగంలో అదనపు ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మోనిష్ సోనెజా ఇటీవల ఓ వెబ్‌నార్‌లో అభిప్రాయపడ్డారు. Also read: COVID-19 vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై స్పష్టత వచ్చేసింది

Trending News