ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో కమలం పార్టీకి గట్టి షాక్ తగిలింది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్య ఆకుల సత్యనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఢిల్లీలో అమిత్ షాను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించునున్నారు. ఏపీలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న విషయం తెలిసిందే. అటు ప్రత్యేక హోదా..ఇటు విభజన హామీల విషయంలో అన్ని పార్టీలు ఆ పార్టీని దోషిగా చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో  బీజేపీకి ప్రతికూల గాలులు వీస్తుందన్నందున ఆకుల ఈ మేరకు నిర్ణయం తీసుకన్నట్లు తెలిసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 పార్లమెంట్ అభ్యర్ధిగా బరిలోకి...


కలమం పార్టీకి గుడ్ బై చెప్పిన ఆకుల సత్యనారాయణ ..ఏ పార్టీలో చేరతారనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఆయన జనసేన పార్టీలో చేరుతారని టాక్.. రాజమండ్రికి వచ్చిన ప్రతీసారీ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్....ఆకుల కుటుంబంతో సన్నిహిత్యంగా మెలుగుతున్నారు. ఈ క్రమంలో ఆకుల సత్యనారాయణ సతీమణి తూ.గో జిల్లాలో జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటంతో ఆయన జనసేన తీర్థం పుచ్చుకోవడం లాంచనమేనని టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి తర్వాత ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో పోటీ చేసేందుకు పవన్ నుంచి హామీ తీసుకున్న తర్వాతే ఆకుల సత్యనారాయణ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.