Prakasam Ballikurava Police Station: ప్రకాశం జిల్లా బల్లికురవ పోలీసుల తీరు వివాదాస్పమవుతోంది. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిందిపోయి.. పోలీసులే వాటిని ఫాలో అవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో స్థానికంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోవడంతో వాటి నివారణకు పోలీసులు మూఢనమ్మకాన్ని ఫాలో అయ్యారు. నల్లకోడిని బలిచ్చి.. పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై పోలీస్ స్టేషన్ గోడలకు అక్కడక్కడా ఆ రక్తాన్ని అంటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా పోలీస్ స్టేషన్ గోడలకు కోడి రక్తాన్ని అంటించడం స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే.. రోడ్ సేఫ్టీ రూల్స్ కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి కానీ ఇలా కోడిని బలిచ్చి.. దాని రక్తాన్ని గోడలకు అంటించడమేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా ఆ బలిచ్చిన కోడి.. సంక్రాంతి కోడి పందాల సందర్భంగా నిర్వహించిన దాడుల్లో పట్టుబడినదిగా చెబుతున్నారు. మరోవైపు, స్థానిక ఎస్సై మాత్రం కోడిని బలిచ్చిన విషయం తనకు తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది.


ఇటీవల తెలంగాణలోని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. నలుగురు అన్నాదమ్ములు తమ పొలంలో ఓచోట నల్లకోడిని బలిచ్చి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. తవ్వకాల్లో వారికి రాగి నాణేలు దొరికినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. 


Also Read: Tilak Varma: హైదరాబాద్‌ యువ ఆటగాడిపై కనక వర్షం.. భారీ ధరకు కొనుగోలు చేసిన ముంబై!!


Also Raed: IPL 2022 Mega Auction: పంజాబ్​కు అల్​ రౌండర్ లివింగ్​ స్టోన్​- రూ.11.50 కోట్లకు కొనగోలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook