అమరావతి: ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని నిగ్గు తేల్చేందుకు నియమించిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ ( BCG ) తుది నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. జీఎన్‌ రావు కమిటీ తరహాలోనే, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, మంత్రులకు అనుగుణంగా రిపోర్టులో పలు అంశాలున్నాయి. బీసీజీ నివేదిక గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీలు (సరికొత్తగా భారీ నగరాల నిర్మాణం) ఏర్పాటు చేయడం విఫల ప్రయోగంగా మారుతుందని బీసీజీ తమ నివేదికలో వెల్లడించింది. సంపద అంతా ఒకే చోట కేంద్రీకృతం కావడం రాష్ట్రానికి శ్రేయస్కరం కాదని.. అమరావతి విషయంలోనూ ఇది వర్తిస్తుందని BCG అభిప్రాయపడింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ జగన్‌కు బీసీజీ ప్రతినిధులు రాజధానిపై కీలక విషయాలు సూచించే నివేదికను శుక్రవారం సమర్పించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక వచ్చేసింది..
 
బీసీజీ నివేదికలో రెండు ఆప్షన్లు ప్రతిపాదించగా, రెండింట్లోనూ విశాఖవైపు మొగ్గు చూపడం గమనార్హం. విశాఖపట్నం అధికార వికేంద్రీకరణ సరైన నిర్ణయమని నివేదికలో పేర్కొన్నారు. విశాఖపట్నం, అమరావతి, కర్నూలు కేంద్రాలుగా పరిపాలన చేయడం సబబేనని సూచించింది. లక్షల కోట్లు పెట్టి కేవలం ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకోవడం అంతర్జాతీయంగా పలు దేశాలలో ప్రతికూల ఫలితాలకు దారి తీసిందని బోస్టన్‌ నివేదిక స్పష్టం చేసింది. విశాఖ, అమరావతి కేంద్రాలుగా రాజధానిని నిర్మిస్తే రూ.4,645కోట్ల వ్యయం ఖర్చవుతుందని.. ఆప్షన్‌ 2 ప్రకారం విశాఖ కేంద్రంగా రాజధాని నిర్మిస్తే రూ.3,500కోట్లలోపే అవుతుందని కమిటీ సిఫారసు చేయడం గమనార్హం. ప్రజలు రాజధానికి రావాల్సిన అవసరం లేకుండా మొత్తం 6 ప్రాంతాల్లో శాటిలైట్ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది.


రాజధానిపై బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ ప్రతిపాదించిన ఆప్షన్లు ఇవే..
ఆప్షన్‌ 1:
విశాఖపట్నంలో గవర్నర్‌ (రాజ్‌ భవన్‌), సచివాలయం, సీఎం కార్యాలయం ఏర్పాటు చేయడం. అత్యవసర సమావేశాల నిమిత్తం శాసనసభ, హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి. కీలకమైన జీఏడీ, న్యాయ, అటవీశాఖ సహా అన్ని ప్రభుత్వ విభాగాలతో నిత్యం అవసరం ఉండే 8 విభాగాల ఏర్పాటు శ్రేయస్కరం. పర్యాటకశాఖతో పాటు పరిశ్రమలకు సంబంధించి పారిశ్రామిక, మౌళిక వసతుల శాఖలకు సంబంధించి విభాగాల కార్యాలయాలు విశాఖ నుంచి విధులు నిర్వహించడం


అసెంబ్లీ, విద్య విభాగాలకు, వ్యవసాయానికి సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు. స్థానిక సంస్థల పనుల విభాగాలతో పాటు మొత్తంగా 15 విభాగాల అధిపతులు అమరావతి కేంద్రంగా పనిచేయడం. అమరావతిలో హైకోర‍్టు బెంచ్‌ ఏర్పాటు చేసి అత్యవసర కేసులు పరిష్కరించడం.


మొదట్నుంచీ ఏపీ ప్రభుత్వం చెబుతున్నట్లుగా కర్నూలు కేంద్రంగా హైకోర్టు ఏర్పాటు. వాటికి అనుబంధ అప్పిలేట్‌ సంస్థలు, రాష్ట్ర కీలక కమిషన్లు విభాగాల విధులు నిర్వహించాలని బీసీజీ తమ నివేదికలో సూచించింది.


Read also : ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దిపై హై పవర్ కమిటీ


బీసీజీ సూచించిన రెండో ఆప్షన్‌..
విశాఖపట్నం కేంద్రంగా సచివాలయం, గవర్నర్‌, సీఎం ఆఫీసు, ప్రభుత్వ అన్ని శాఖల అధిపతుల కార్యాలయాలు పనిచేయడం. అత్యవసర సమావేశాలను దృష్టిలో ఉంచుకుని శాసనసభ, హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయడం ఉత్తమమని కమిటీ తమ నివేదించింది.


రాష్ట్ర అసెంబ్లీ ఏర్పాటుతో పాటు అత‍్యవసర, కీలక కేసుల నిమిత్తం హైకోర్టు బెంచ్‌ అమరావతి కేంద్రంగా విధులు నిర్వహించాలని బీసీజీ సభ్యులు అభిప్రాయపడ్డారు.


వైఎస్‌ జగన్‌ సర్కార్‌ భావిస్తున్నట్లుగానే.... కర్నూలులో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. న్యాయ విభాగానికి అనుబంద అప్పిలేట్‌ సంస్థలు సైతం కర్నూలులో ఏర్పాటు చేయాలి. రాష్ట్రానికి సంబంధించి కమిషన్లు ఇక్కడే ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి దోహదపడుతుందని బోస్టన్‌ కమిటీ సభ్యులు వైఎస్‌ జగన్‌కు సమర్పించిన నివేదికలో తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..