Pawan kalyan: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌కు కళ్యాణ్‌కు ఆలింగనం చేసుకున్న బొత్స సత్యనారాయణ.. వీడియో వైరల్..
Pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్.. బొత్స సత్యనారాయణల మధ్య ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Pawan kalyan and botsa satyanarayana video: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కూటమి పార్టీకి చెందిన నేతలు.. గత సర్కారు హయాంలో జరిగిన అక్రమాలను ఏకీపారేస్తునే.. మరోవైపు తమ సర్కారు అమలు చేస్తున్న పథకాలను గురించి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ మాత్రం దూరంగా ఉన్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో మండలిలో మాత్రం వైసీపీ అధికార పార్టీని కార్నర్ చేసే విధంగా పాలనపై ఆరోపణలు చేస్తుంది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ ప్రాంగణలో మాత్రం ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అసెంబ్లీ ప్రాంగణం నుంచి తన కారులోకి ఎక్కేందుకు వెళ్తున్నారు. అప్పుడు.. ఎదురుగా వైస్సార్సీపీ ఎమ్మెల్సీ.. బొత్స సత్యనారాయణ కన్పించారు. దీంతో అక్కడే ఉన్న పెద్దిరెడ్డి రామ చంద్ర రెడ్డి పక్కకు వెళ్లిపోగా.. బొత్స సత్యనారాయణ మాత్రం.. పవన్ కళ్యాన్ ను పలకరించి.. ఆత్మీయంగా హత్తుకున్నారు.
ఒకరికి మరోకరు కుశల ప్రశ్నలు వేసుకున్నట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పవన్ బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసినట్లు తెలుస్తొంది. పవన్ కళ్యాణ్ కారులో వెళ్లిపోగా.. బొత్స అసెంబ్లీ లోపలికి వెళ్లిపోయారు. ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.
మరోవైపు గత సర్కారు అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని.. ఉపాధి పథకం నిధులు రూ. 13 వేల కోట్ల వరకు మళ్లించారని, జాబ్ కార్డుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని కూడా మండిపడ్డారు. ఏపీలో మాత్రం.. ప్రస్తుతం కూటమి వర్సెస్ వైసీపీగా మారిందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter