Trolls On Roja: ఏ ప్రభుత్వం మీద అయినా రెండు మూడేళ్లకు వ్యతిరేకత వస్తుందని.. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఐదు నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని మాజీ మంత్రి రోజా అన్నారు. పిల్లి అయినా రూమ్‌లో కొడితే తిరగబడుతుందని.. సో జనాల్లో తిరుగుబాటు వస్తే తరిమి కొడతారని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ.. తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి చెబుతూ.. కన్నీటి పర్యాంతమయ్యారు.
రాజకీయాల్లో ఉంటున్నాం కాబట్టి దెబ్బకి ఎదురు దెబ్బ ఉంటుందని.. మనం అంటాం అనిపించుకోవాలని రోజా అన్నారు. అయితే పిల్లలకు ఏం తెలుసు చాలా హర్ట్ అయిపోతారని అన్నారు.
తన జీవితంలో జీర్ణించుకోలేని విషయం గురించి చెప్పారు. రోజా మాటల్లోనే.. "నా బర్త్ డే రోజు. మా రెండో అన్నయ్య రామ్ ప్రసాద్ రెడ్డి నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని స్కూల్ కి కాలేజీకి తీసుకొని వెళ్లాడు. నేను హీరోయిన్ అయ్యాక నాతోనే లైఫ్ అంతా కూడా షూటింగ్స్‌కి వచ్చేవాడు.
ఆయన ముద్దు పెడితే దాన్ని ఎంత వల్గర్‌గా ట్రోల్ చేశారంటే అసలు ఏడుపు వచ్చేసింది. ఆ అలాగే నా కొడుకు కౌశిక్. ఎప్పుడూ కూడా నన్ను వెనక నుంచి ఇలా మమ్మీని పట్టుకొని ఉంటారు. ఏ ఫోటో చూసినా అలానే ఉంటుంది.
ఆ ఫోటోను న్యూడ్ ఫోటోస్ చేసి పెట్టారు. అసలు ఈ విషయం నా కొడుకు నాకు చెప్పలేక వన్ వీక్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. నాకు తెలియదు ఇవన్నీ. ఎందుకు ఇలా సైలెంట్‌గా ఉన్నావని అడిగితే అసలు విషయం చెప్పాడు.." అంటూ రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇక సినిమాల్లో రీఎంట్రీ గురించి మాట్లాడుతూ.. తప్పకుండా మళ్లీ యాక్టింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పారు. తాను పొలిటికల్‌గా ఇంత ఎదిగానంటే అది ఓన్లీ ప్రేక్షకుల అభిమానమేనని అన్నాను. సినిమాలు, జబర్దస్త్, బతుకు జట్కా బండి ఇవన్నీతో ప్రతి ఇంటిలోకి వెళ్లిపోయానన్నారు.
మళ్లీ మంచి సినిమాలు చేయాలనుకుంటున్నానని.. పవర్‌ఫుల్ రోల్ ఏదైనా వస్తే చేస్తానన్నారు రోజా. రమ్యకృష్ట శివగామిలా, అత్తాంటికి దారేది మూవీలో నదియా వంటి పాత్రలు చేస్తానని చెప్పారు.