BS 6 Fuel Production: విశాఖలో త్వరలో బీఎస్ 6 ఇంధన ఉత్పత్తి ప్రారంభం
BS 6 Fuel Production: బీఎస్ 6 ఇంధన ఉత్పత్తి. కాలుష్య నివారణకు అవసరమైన భారత్ స్టేజ్ 6 ఇంధనం. ఈ ఇంధన ఉత్పత్తికి విశాఖపట్నం ఇప్పుడు ప్రముఖ పాత్ర పోషించబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రియాక్టర్లు విశాఖ చేరుకున్నాయి.
BS 6 Fuel Production: బీఎస్ 6 ఇంధన ఉత్పత్తి. కాలుష్య నివారణకు అవసరమైన భారత్ స్టేజ్ 6 ఇంధనం. ఈ ఇంధన ఉత్పత్తికి విశాఖపట్నం ఇప్పుడు ప్రముఖ పాత్ర పోషించబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రియాక్టర్లు విశాఖ చేరుకున్నాయి.
వాహనాల్నించి వెలువడే ఉద్గారాలను నియంత్రించేందుకు అవసరమైన భారత్ స్టేజ్ 6 ఇంధనం(BS 6 Fuel). ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఇంధనం గురించే చర్చ నడుస్తోంది. ఈ కీలకమైన ఇంధన ఉత్పత్తికి విశాఖపట్నం కీలకపాత్ర పోషించబోతోంది. విశాఖ కేంద్రంగా ఉన్న హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( HPCL) త్వరలోనే ఇంధన ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించనుంది. వాహనాలు కూడా బీఎస్ 6 ఇంజన్‌వే ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం (Central government) నిర్ణయించిన నేపధ్యంలో బీఎస్ 6 ఇంధనానికి ప్రాధాన్యత ఏర్పడింది. బీఎస్ 4 వాహనాలతో పోలిస్తే బీఎస్ 6 వాహనాల్నించి వచ్చే కాలుష్యం చాలా తక్కువ. బీఎస్ 6 వాహనం నుంచి నైట్రోజన్ ఆక్సైడ్ 25 శాతం తక్కువ వెలువడుతుంది.
విశాఖలోని హెచ్‌పీసీఎల్ విస్తరణలో భాగంగా బీఎస్ 6 పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి చేపట్టనుంది. దీనికోసం రిఫైనరీ ప్రాజెక్టుకు అవసరమైన భారీ రియాక్టర్లు (World Biggest Reactors) విశాఖకు చేరుకున్నాయి. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద రియాక్టర్లు కావడం విశేషం. అత్యంత కీలకమైన ఎల్‌సీ మ్యాక్స్ రియాక్టర్లను విశాఖ రిఫైనరీలో ఏర్పాటు చేయనున్నారు. ఎల్ అండ్ టి సంస్థ వీటిని తయారు చేసి గుజరాత్ హెచ్‌పీసీఎల్ (Gujarat Hpcl) ప్రధాన కార్యాలయానికి అప్పగించింది. ఒక్కో రియాక్టర్ పొడవు 67.817 మీటర్లు కాగా వెడల్పు 12.2 మీటర్లుగా ఉంది. బరువు 2 వేల 105 టన్నులు. తొలిసారిగా ఆర్‌యూఎఫ్ క్రూడ్ ఆయిల్ నుంచి బీఎస్ 6 డీజిల్ తీసేందుకు ఈ రియాక్టర్లు ఉపయోగపడుతాయి. సల్ఫర్ అత్యధికంగా ఉండే ముడి చమురును కూడా బీఎస్ 6 ప్రమాణాలకు అనువైన అధిక నాణ్యత కలిగిన పెట్రోల్, డీజిల్‌గా మార్చే ప్రక్రియను విశాఖలో చేపడతారు.
ప్రపంచంలోనే అతిపెద్దవైన రెండు రియాక్టర్లు ఇప్పటికే సముద్రమార్గం ద్వారా విశాఖకు చేరుకున్నాయి. మూడవ రియాక్టర్ చేరుకున్న తరువాత పనులు ప్రారంభం కానున్నాయి. బీఎస్ 6 వాహనాలకు (BS 6 Vehicles) అవసరమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా హెచ్‌పీసీఎల్ మరో ముందడుగు వేయనుంది. చమురు ఉత్పత్తుల్ని మెరుగుపర్చడమే కాకుండా ఫీడ్‌స్టాక్ పెంచేందుకు ఈ రియాక్టర్లు ఉపయోగపడుతాయి.
Also read: AP Municipal Elections: రాష్ట్రంలో మరోసారి మున్సిపల్ ఎన్నికల సమరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook