Anganwadi Workers: తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో చంద్రబాబు ప్రభుత్వం దిగి వచ్చింది. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు బంపర్‌ బొనాంజా ప్రకటించింది. చిన్నారుల మానసిక.. శారీరకంగా ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే అంగన్‌వాడీ కార్యకర్తలకు ఏపీ ప్రభుత్వం గ్రాట్యూటీ ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాకుండా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Poice: చంద్రబాబు సినీ పరిశ్రమ టార్గెట్‌.. త్వరలోనే పోసాని, శ్రీరెడ్డి, రామ్‌ గోపాల్‌ వర్మ అరెస్ట్‌?


 


అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి సంధ్యారాణి ప్రకటించారు. అంగన్‌వాడీ కార్మికులతో చర్చించి దశల వారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారికి ఇవ్వాల్సిన గ్రాట్యూటీ చెల్లింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తాము సానుకూలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటామని.. సేవలకు మాత్రం ఆటంకం కలగకుండా చూడాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. సమ్మె వలన చిన్నారులు, బాలింతలు, గర్భిణిలు ఇబ్బంది పడుతారనే విషయాన్ని గ్రహించి ఆందోళన విరమించాలని కోరారు.

Also Read: AP Liquor: ఇంట్లోకి మద్యం సీసాలు పెంచండి సీఎం గారు.. ఏపీ అసెంబ్లీలో 'లిక్కర్‌ నవ్వులు'


రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లులు, పిల్లలు, గర్భిణిలకు ఆరోగ్య, పోషకాహార సేవలు అందిస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి వివరించారు. సమ్మెలు, ఆందోళనలతో సమస్యలు పరిష్కారం కావని.. దశలవారీగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంగన్‌వాడీ సమస్యల అంశం శాసనమండలిలో కూడా చర్చకు వచ్చింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కోసం 7,090 అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.70 కోట్లు నిధులను విడుదల చేసినట్లు మంత్రి సంధ్యారాణి వివరించారు. రూ.లక్ష చొప్పున రూ.70.90 లక్షల నిధులు విడుదల చేసినట్లు ప్రకటించారు.ఆ నిధులతో ఎల్‌ఈడీ టీవీలు, ఆర్‌ఓ ప్లాంట్లు, బెంచీలు, కుర్చీలు, పిల్లలకు ఆట బొమ్మలు వంటివి అందిస్తామని వెల్లడించారు.


ఏపీలో అంగన్‌వాడీ వ్యవస్థ తీరు
అంగన్‌వాడీ కేంద్రాలు: 55,607
సేవలు పొందుతున్న గర్భిణి, బాలింతలు మొత్తం 5,31,446 మంది
మూడేళ్లలోపు పిల్లలు: 13,03,384 మంది
3-6 ఏళ్ల లోపు పిల్లలు: 7 లక్షల మంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter