గోపాలపురం: ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై ( YSRCP MLA Talari Venkat Rao ) కేసు నమోదైంది. 2017 డిసెంబర్‌లో తలారి వెంకట్రావు తన అనుచరులతో కలిసి వచ్చి తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని పేర్కొంటూ ద్వారకా తిరుమల మండలం మాలసానికుంటకు చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే పోలీసులు అప్పుడు కేసు నమోదు చేయకపోవడంతో ఈ విషయంలో తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ ఆదిలక్ష్మి ఏపీ హైకోర్టును ( AP high court ) ఆశ్రయించారు. ఆదిలక్ష్మి పిటిషన్‌ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు మరో 12 మందిపై కేసు నమోదు చేయాల్సిందిగా ద్వారకాతిరుమల పోలీసులను ఆదేశించింది. Also read : Fine for not wearing mask in car: కారులో వెళ్తున్న న్యాయవాది మాస్కు ధరించలేదని ఛలానా
    
హై కోర్టు ఆదేశాల మేరకు తాజాగా ఐపీసీ 448, 506, సెక్షన్ల కింద ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు 12 మందిపై ద్వారకాతిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. Also read : 
IPL 2020: ధోనిని ట్రోల్ చేసి పాండ్యా... రిప్లై ఇచ్చిన డివిలియర్స్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR