Caste Census: కులాల రాజకీయాలతో ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉండే ఏపీలో మరో వేడి రాజుకోనుంది. బీహార్ తరువాత ఇప్పడు రాష్ట్రంలో కూడా కుల గణన జరగనుంది. ఏపీ రాజకీయాల్లో కుల గణన ప్రక్రియకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ విధంగా, ఎలా చేయాలనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల నుంచి వివిధ వర్గాల సమాచారం సేకరించింది. పూర్తి స్థాయిలో కుల గణన ప్రక్రియను నవంబర్ 20 తరువాత ప్రారంభించనుంది. మొన్న జరిగిన కేబినెట్ భేటీలో కుల గణనకు ఆమోదం లభించాక రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా పూర్తయ్యాయి. సమగ్ర కుల గణన ప్రక్రియకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సామాజిక, రాజకీయ, ఆర్ధిక, ఆరోగ్య, విద్యా ఫలాలు అందించేందుకు కుల గణన నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో కుల గణన జరిగి దాదాపు వందేళ్లు పూర్తయింది. కులాల వారీగా రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలు అందించేందుకు ఈ కుల గణన ప్రక్రియ దోహదపడనుందని తెలుస్తోంది. 


ఏపీలో కుల గణన సులభమే


ఏపీలో ఇప్పటికే గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయ వ్యవస్థ ఉంది. దీనికి అనుసంధానంగా వార్డు, గ్రామ వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తోంది. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ ఉన్నాడు. అయితే కుల గణన ప్రక్రియలో వాలంటీర్లను కాకుండా సచివాలయ ఉద్యోగులు నిర్వహించనున్నారు. సచివాలయం ఉద్యోగులు ప్రతి ఇంటిని సందర్శించి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తే..ఈ సమాచారం ఆధారంగా ప్రతి సచివాలయం పరిధిలో 10 శాతం ఇళ్లలో రీ వెరిఫికేషన్ ఉంటుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ అభివృద్ధి చేయనుంది. న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశమున్నందున వాలంటీర్లను ఇందులో భాగం చేయకపోయినా, ప్రతి గ్రామానికి సచివాలయం ఉండటంతో కుల గణన ప్రక్రియ సులభతరం కావడమే కాకుండా వేగంగా పూర్తి కావచ్చని అంచనా.


Also read: Chandrababu Bail Conditions: చంద్రబాబు బెయిల్‌కు అదనపు షరతులు వర్తిస్తాయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook