JD Lakshminarayana: ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరస్ట్ తరువాత జనసేన-టీడీపీ పొత్తు పొడిచింది. అటు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారుతోంది. ఆయన చేసే వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి నిర్వహించారు. ఈ సందర్భంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణను ఆయన ఆహ్వానించారు. కార్యక్రమానికి హాజరైన లక్ష్మీ నారాయణ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించారు. విద్యా, వైద్య రంగాల్లో మంచి చేసేవారికి కచ్చితంగా ఫలితాలు కూడా బాగుంటాయన్నారు. ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పధకాలు చాలా మంచివని ప్రశంసించారు. తాను చదువుకున్న స్కూల్ గతానికి ఇప్పటికీ చాలా మారిందని, ఇప్పుడా స్కూళ్లో పిల్లలకు పౌష్టికాహారం ఇస్తున్నారని లక్ష్మీ నారాయణ తెలిపారు. 


సాధారణంగా ఆరోగ్యానికి సంబంధించి ఒకరోజు క్యాంపుతో సరిపెడుతుంటారని కానీ రోజుల తరబడి క్యాంపు కొనసాగించడం, వైద్యులు నేరుగా వచ్చి ఆరోగ్యాన్ని పరీక్షించి అవసరమైన పరీక్షలు చేయడం నిజంగా అభినందనీయమన్నారు. స్కూలు పిల్లలకు రాగి జావ అందించడం, మద్యాహ్నం భోజనం నాణ్యంగా ఉండేట్టు చూడటం నిజంగా ప్రశంసనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు అన్ని సౌకర్యాలతో సుందరంగా ముస్తాబయ్యాయన్నారు. 


ఏ వ్యక్తినైతే అరెస్టు చేశారో అదే వ్యక్తిపై ప్రశంసలు కురిపించడం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ జగన్‌ను ప్రశంసించిన తీరు ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. గతంలో కూడా వివిధ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో జగన్ వ్యక్తిత్వం, వైఖరి గురించి లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఆఖరికి జగన్‌పై కేసులకు ఆధారాల్లేవని, నిలవవని చెప్పింది కూడా ఆయనే. 


Also read: Chandrababu Letter: నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది, ఏసీబీ న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook