YS Viveka murder case: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్​ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ఆధారాలు సంపాదించినట్లు సీబీఐ వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కేసులో గజ్జల ఉమాశంకర్ రెడ్డి పాత్రపై కీలక ఆధారాలు ఉన్నట్లు తెలిపింది. హత్య జరిగిన రోజు తెల్లవారు జామున రోడ్డుపై అతడు (CBI on YS Viveka Murder case) పరుగులు తీస్తున్నట్లు గుర్తించామని పేర్కొంది. దీనికి సంబంధించి సీసీటీవీ దృష్యాలు లభ్యమైనట్లు కూడా సీబీఐ స్పష్టం చేసింది.


బెయిల్ కోసం నింధితుల పిటిషన్​..


ఈ కేసులో అరెస్టయిన గజ్జల ఉమాశంకర్​ రెడ్డి సహా ఇతర నిధితులు ఇటీవల బెయిల్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక సెషన్స్​ కోర్టులో ఈ కేసు శనివారం విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో వారికి బెయిల్​ మంజూరు చేయొద్దని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. ఈ సందర్భంగానే అతడికి సంబంధించిన ఆధారాల గురించి కోర్టుకు వివరించారు.


Also read: Volunteer Rapes Minor Girl: గ్రామ సచివాలయంలో బాలికపై వాలంటీర్ రేప్.. ఆలస్యంగా వెలుగులోకి!


Also read: Payyavula Keshav: ఏపీ సౌర విద్యుత్ కొనుగోళ్లలో బిగ్ స్కామ్.. పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు


వీడియోలో ఉన్నది ఉమాశంకరే...


సీబీఐకి లభించిన సీసీటీవీ దృష్యాలను ప్రత్యక్షంగా పరీక్షించి నిర్ధరణ చేసుకున్నట్లు కూడా సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.


ప్రత్యక్ష సాక్షులు, నిపుణుల పర్యవేక్షణలో ఉమాశంకర్ పరుగును రికార్డ్​ చేసినట్లు వెల్లడించారు. ఈ వీడియోతోపాటు సీసీటీవీ దృష్యాలను గుజరాత్​లోని ఫోరెన్సిక్​ సైన్స్​ డైరెక్టర్​, బెంగళూరు ఫిల్మ్​ ఫ్యాక్టర్​కు పంపినట్లు తెలిపారు. రెండింటి నుంచి వచ్చిన ఫలితాల్లో అందులోని వ్యక్తి పరుగులో పోలికలు ఉన్నట్లు అభిప్రాయపడ్డారని వివరించారు సీబీఐ దరఫు న్యాయవాది.


Also read: CBN Demands To Cut Petrol Price: ఏపీలో పెట్రో ధరలు తగ్గించాలని చంద్రబాబు డిమాండ్!


సీబీఐ వాదనతో ఏకీభవించిన న్యాస్థానం నిధుతులకు బెయిల్​ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రధాన నిందితులుగా ఉన్న ఎర్ర గండిరెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, యాదటి సునీల్ యాదవ్​, షేక్ దస్తగిరిల పాత్రపై దర్యాప్తు జరుగుతున్నందున ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని వివరించింది.


Also read: Heavy Rains Alert: ఏపీలో మరో 3-4 రోజుల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక


Also read: TTD: మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎందుకంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook