Volunteer Rapes Minor Girl: గ్రామ సచివాలయంలో బాలికపై వాలంటీర్ రేప్.. ఆలస్యంగా వెలుగులోకి!

శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామంలో గ్రామ వాలంటీర్ ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.గ్రామ సచివాలయంలోనే బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 12:24 PM IST
  • శ్రీకాకుళం జిల్లాలో బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం
  • గ్రామ సచివాలయంలోనే అఘాయిత్యం
  • వాలంటీర్‌కు సహకరించిన మరో ఉద్యోగి
  • నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
Volunteer Rapes Minor Girl: గ్రామ సచివాలయంలో బాలికపై వాలంటీర్ రేప్.. ఆలస్యంగా వెలుగులోకి!

Srikakulam Village Volunteer Rapes a Minor Girl: శ్రీకాకుళంలో దారుణం జరిగింది.ఓ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.గ్రామ సచివాలయంలోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు.సచివాలయంలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి అతనికి సహకరించాడు. గత నెల 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

వీరఘట్టం మండలం నడుకూరు సచివాలయంలో బొత్స హరిప్రసాద్ అనే వ్యక్తి వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ బాలికపై అతను కన్నేశాడు.గత నెల 31న ఆ బాలికకు మాయ మాటలు చెప్పి ఆమెను గ్రామ సచివాలయానికి తీసుకెళ్లాడు.ఆ సమయంలో సచివాలయంలో ఎవరూ లేరు.కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాంబాబు అనే వ్యక్తిని సచివాలయం బయట కాపలా ఉంచాడు.ఆపై సచివాలయంలోనే బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

Also Read: KL Rahul: ప్రేయసిని పరిచయం చేసిన టీమిండియా ఓపెనర్..వైరల్ గా మారిన ఫోటో..

లైంగిక దాడికి గురైన బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది.కాసేపటికి స్పృహలోకి వచ్చిన బాలిక.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయింది.ఆ ఘటన జరిగిన రోజు బాధిత బాలిక తల్లిదండ్రులు ఊరిలో లేరు.ఈ నెల 3న తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చాక... బాధిత బాలిక వారికి జరిగిన విషయం చెప్పింది.దీంతో బాలికను వెంటపెట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తల్లిదండ్రులు నిందితుడిపై ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇందులో భాగంగా ఈ నెల 4న దిశ పోలీస్ బృందం గ్రామంలో పర్యటించి వివరాలు సేకరించింది.బాలికపై లైంగిక దాడి చేసిన హరిప్రసాద్‌తో పాటు అతనికి సహకరించిన రాంబాబు అనే వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Also Read: Chiranjeevi 154 Movie Poster: మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా ఫస్ట్ లుక్.. ఫ్యాన్స్ కు ఇక పూనకాలే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News