CBN Demands To Cut Petrol Price: ఏపీలో పెట్రో ధరలు తగ్గించాలని చంద్రబాబు డిమాండ్!

Chandrababu comments on AP cm Jagan: ఆంధ్రప్రదేశ్​లో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్​ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలను తగ్గిస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తి చేశారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 06:14 PM IST
  • ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు చంద్రబాబు డిమాండ్
  • ఆంధ్రప్రదేశ్​లోనే అత్యధికంగా పన్నులు ఉన్నాయని ఆరోపణ
  • ధరలు తగ్గించకుంటే ఆందోళన చేస్తామని స్పష్టీకరణ
CBN Demands To Cut Petrol Price: ఏపీలో పెట్రో ధరలు తగ్గించాలని చంద్రబాబు డిమాండ్!

Chandrababu demands For Cut Petrol Prices in AP:  దేశంలో గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol prices in India) ఆకాశానంటుతున్నాయి. అంతర్జాతీయంగా గత ఏడాది దాదాపు మూడు దశాబ్దాల స్థాయికి ముడి చమురు ధరలు తగ్గినా కూడా దేశంలో పెట్రోల్, డీజిల్​ ధరలు మాత్రం తగ్గలేదు.

కరోనా సమయంలోనూ (Petrol prices in Corona Time) పెట్రోల్​, డీజిల్ ధరలు భారీగా పెరిగాయే తప్పా.. తగ్గిన దాఖలాలు లేవు. అప్పుడప్పుడు ధరలు తగ్గినట్లు అనిపించినా.. కొన్ని రోజుల్లోనే తిరిగి జీవనకాల రికార్డు స్థాయికి చేరేవి.

ఈ విషయంపై రాజకీయంగా, సామాజికంగా పెద్ద ఎత్తున్న కేంద్రంపై వ్యతిరేకత వచ్చింది. గత ప్రభుత్వం జారీ చేసిన ఆయిల్ బాండ్లకు వడ్డీ చెల్లింపులు ఇంకా మిగిలి ఉన్నందున.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం లేదని కూడా గతంలో చెప్పింది.

Also read: Petrol, Diesel prices: కేంద్రం దీపావళి కానుక.. పెట్రోల్‌, డీజిల్ ధరల తగ్గింపు

దీపావళి కానుకగా కేంద్రం కీలక నిర్ణయం..

ఈ పరిణామాలన్నింటిని నేపథ్యంలో కేంద్రం దీపావళి కానుకగా.. పెట్రోల్, డీజిల్​పై ఎక్సైజ్​ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం కీలక తీసుకుంది. లీటరు పెట్రోల్‌పై (Exise Duty on Petrol) రూ.5లు, లీటరు డీజిల్‌పై (Exise Duty on Diesel) రూ.10 చొప్పున తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీనితో ఈ గురువారం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. ఫలితంగా దీనితో వాహనదారులకు కాస్త ఉపశమనం లభించింది.

ప్రజలపై పెట్రో భారం తగ్గించేందుకు.. రాష్ట్రాలు కూడా పన్నుల్లో కోత విధించాలని కేంద్రం పిలుపునిచ్చింది. కేంద్రం పిలుపు మేరకు పలు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి. తమిళనాడు గతంలోనే తమ పన్నులు తగ్గించడం విశేషం. పన్నులు తగ్గించిన వాటిలో ఎక్కువ శాతం బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఇంకా పలు రాష్ట్రాలు పన్నుల తగ్గింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యంగా ఆంద్రప్రదేశ్, తెలంగాణలో ఆ (Petrol price in AP, Telangana) దిశగా అడుగులు పడలేదు.

Also read: Edible Oil Price Reduced: దేశంలో భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు.. లీటరుకు రూ.5 నుంచి రూ.20 తగ్గింపు

Also read: Covaxin Vaccine For Children: అమెరికాలోని చిన్నారులకూ కొవాగ్జిన్ టీకా.. త్వరలోనే అత్యవసర వినియోగానికి అనుమతి

చంద్రబాబు ఫైర్​..

దీనితో ఆంధ్రప్రదేశ్​ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు.. ముఖ్య మంత్రి జగన్మోహన్​ రెడ్డి​పై (CBN vs CM Jagan) తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. తాను అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అధికారంలో ఉన్నా ఇప్పుడెందుకు ధరలు తగ్గించడం లేదని ప్రశ్నించారు. జగన్​ది తుగ్లక్ పాలన అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also read: Fuel Price Cut: భారీగా దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రస్తుత రేట్లు ఇవే..

Also read: OnePlus into Electric vehicles market: విద్యుత్ వాహనాల తయారీ రంగంపై వన్​ ప్లస్​ ఆసక్తి!

ఆంధ్రప్రదేశ్​లోనే అత్యధికం?

కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పుడు.. పలు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయని.. మరి ఏపీలో ఎందుకు ధరలు తగ్గించడంలేదని సీఎం జగన్​పై నిప్పులు చరిగారు. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక పెట్రోల్ ధరలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని ఆరోపించారు.

ఏపీలో వెంటనే పెట్రోల్​పై రూ.16, డీజిల్​పై రూ.17 వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు. పెట్రోల్​, డీజిల్ ధరల ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని చెప్పుకొచ్చారు.

Also read: Volunteer Rapes Minor Girl: గ్రామ సచివాలయంలో బాలికపై వాలంటీర్ రేప్.. ఆలస్యంగా వెలుగులోకి!

Also read: Payyavula Keshav: ఏపీ సౌర విద్యుత్ కొనుగోళ్లలో బిగ్ స్కామ్.. పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు

ఆంక్షలున్నా భారీ ఆదాయం..

వాహనాల రాకపోకలకు ఆంక్షలు ఉన్న సమయంలోనూ పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.11,014 కోట్ల ఆదాయాన్ని గడించిందని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో పెట్రోల్​పై 31 శాతం, డీజిల్​పై 22.5 శాతం పన్నులు వసూల చేస్తున్నట్లు వివరించారు. దేశంలో ఇదే అత్యధికమన్నారు. పన్నులను వెంటనే తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేపడతమాని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Also read: Chandrababu :ఏపీ ఎన్నికల కమిషన్‌ సంఘం తీరుపై చంద్రబాబు ఆగ్రహం

Also read: Jagananna sampoorna gruha hakku : త్వరలో ప్రారంభంకానున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News